టీఆర్ ఎస్ ఎయిడ్స్ పార్టీనా ?

Update: 2020-03-19 15:53 GMT
తెలంగాణ లో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ , ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి ఇంటి పై డ్రోన్ ఎగురవేసి, జైలుకి వెళ్లిన రేవంత్ చర్లపల్లి జైలు నుంచి విడుదలైన కాసేపటికే సీఎం కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అక్రమాలను బయటపెట్టేందుకు తాను కాంగ్రెస్‌ లో చేరానని స్పష్టం చేశారు. అలాగే తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ దేశానికీ పాతిన కరోనా అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.

సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలకి కౌంటర్ గా 'కాంగ్రెస్‌ కరోనా పార్టీ అయితే... టీఆర్‌ ఎస్‌ ఎయిడ్స్‌ పార్టీ' అని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‍ అవినీతిపై పోరాటం తన వ్యక్తిగతం కాదన్నారు. 2 నెలల క్రితం రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని తనకు బాధ్యతలు అప్పజెప్పారని గుర్తుచేశారు. అందులో భాగంగానే జన్వాడలో కేటీఆర్ అక్రమ ఫామ్ హౌజ్ ను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల తో కలిసి ప్రజలకు చూపించానన్నారు. ఇది తెలియకుండా కొందరు కాంగ్రెస్ నేతలు తమపై వ్యక్తిగత విమర్శలు చేశారని , సొంత పార్టీ నేతలపై కూడా పరోక్షంగా విమర్శలు చేసారు.

కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై నేటి నుంచి ఆధారాల తో సహా మొత్తం బయట పెడతానన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్‍ఎస్‍పై పోరాడతానన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరింది పదవి కోసమో, డబ్బు కోసమో కాదని, కేసీఆర్ మీద పోరాడేందుకేనని స్పష్టం చేశారు. అలాగే తన అవినీతి ఆరోపణలు ప్రత్యక కథనాన్ని ప్రసారం చేసిన tv9 ని ,మై హోమ్ రామేశ్వరరావులను విడిచిపెట్టబోనని అన్నారు.
Tags:    

Similar News