1000 కోట్ల భూ స్కాం..ఆధారాలిప్పుడే ఇస్తా- రేవంత్‌ రెడ్డి

Update: 2018-04-12 11:41 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. ఈ ద‌ఫా మ‌రో భూ స్కాం గురించి వెల్ల‌డించారు. ప్రభుత్వ కనుసన్నల్లో కాప్రాలో వెయ్యి కోట్ల భూ స్కామ్ జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ విభజన సమయంలో రహీమ్ భక్షికి సంబందించిన భూమిలో ఈ స్కాం జ‌రిగింద‌న్నారు. `అవేక్యూ భూమిని నాడు ప్రభుత్వం పాకిస్థాన్ నుండి వచ్చిన ఈశ్వరి భాయికి కేటాయించింది. ఈ వేయి కోట్ల భూకుంభకోణం సూత్రదారులు ప్రభుత్వ పెద్దలే. లబ్ధిదారులు మైహోం జూపల్లి రామేశ్వర్ రావు. 2011లో సుప్రీంకోర్ట్ అవాక్యు ప్రాపర్టీ స్పష్టంగా తేల్చింది. సుప్రీం చెప్పిన తర్వాత ప్రభుత్వ ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు` అని ఆరోపించారు.

మైహోం రామేశ్వర్ రావుకు  భూమిని కట్టబెట్టేందుకు నిబంధలనలను కేటీఆర్ పక్కనబెట్టార‌ని రేవంత్ ఆరోపించారు. ``ప్రభుత్వ భూమి అని రికార్డ్స్ ఉండగా ..జూపల్లి రామేశ్వర్ రావు 20ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ఎలా చేస్తారు? ఈ భూమిపై జీపీఏ ఉన్న బాలకృష్ణను పోలీసులతో బెదిరించి రామేశ్వర్ రావ్ పేరుమీద సెల్ డీడ్ చేయించుకున్నారు. అవేక్యూ భూమిని లేఔట్ లు చేసి మైహోం అమ్ముకుంటుంది. కేటీఆర్ స్వంత శాఖలో ఈ తతంగం జరుగుతుంటే కనబడదా? గుడిసెలు వేసుకుంటే తొలగిస్తారు  కానీ వేల కోట్ల భూమిని మైహోం దోచుకుంటే కనవడదా ?`` అని రేవంత్ ప్ర‌శ్నించారు. ``కాప్రాలో మైహోం భూదందా చేస్తున్నది వాస్తవమా కాదా కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటె అక్కడ జరుగుతున్న అమ్మకాలను అడ్డుకోవాలి. అవేక్యూ ప్రాపెర్టీస్ ను కొల్లగొడుతున్నారని మీ పత్రికలో వచ్చింది నిజం కాదా కేటీఆర్? ఈ ప్రభుత్వ కస్టోడియన్‌గా స్వాధీనం చేసుకోవాలి` అని కోరారు.

ఈ భూమికి సంబందించిన సమాచారాన్ని కేటీఆర్ ఇచ్చేనందుకు తాను రెడీగా ఉన్నాన‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. ``కేటీఆర్ చెప్పేందుకు నాకెలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వం భూమిని రామేశ్వరరావు దోచుకుంటుంటే చూస్తూ ఉరుకోం. ఈ భూదందాపై న్యాయస్థానానికి వెళతాం. కేటీఆర్ తో ఆభూమి పరిశీలనకు వెళ్లేందుకు నేను రెడీ. కేటీఆర్‌ కు బంధుప్రీతి లేకపోతే తక్షణమే ఆ భూములను పరిశీలించాలి. కేసీఆర్ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా గవర్నర్ మారారు` అని ఆరోపించారు.
Tags:    

Similar News