కాంగ్రెస్ లో ఒకరు ఎదగరు.. ఎదిగే వారిని ఎదగనీయరు.. కప్పెల తక్కెడలా పైకి లేసే వారిని కాళ్లు పట్టుకొని వెనక్కి లాగుతూనే ఉంటారనే పేరుంది. పనిచేస్తున్న వారిని అస్సలు పనిచేయకుండా గ్రూపులు కట్టి ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తారనే విమర్శలున్నాయి.తాజాగా టీపీసీసీ చీఫ్ గా నియామకమైన రేవంత్ రెడ్డికి అడుగడుగునా సీనియర్ల నుంచి అడ్డంకులు ఎదరువుతున్నట్టు టాక్.
కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి అత్యంత యాక్టివ్ గా మారి పార్టీ కోసం సభలు, సమావేశాలు, కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అయితే ఆయన ముందరి కాళ్లకు బంధం వేసేలా ఏవో లెక్కల్ని తెరమీదకు తీసుకొచ్చి నెగెటివ్ అంశాన్ని చర్చకు తెచ్చి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి తాజాగా ఢిల్లీ పిలుపు రావడం వెనుక కథ వేరే ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ ఎంతో పైకి లేచింది. ఆ విషయం కాంగ్రెస్ నేతలకు తెలుసు. అధిష్టానం గుర్తించింది. తెలంగాణ కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న టీఆర్ఎస్, బీజేపీకి షాకిచ్చేలా రేవంత్ రెడ్డి పార్టీకి ఊపు తెచ్చాడు. గులాబీ దళానికి చురుకుపుట్టిస్తున్నాడు. కేసీఆర్ అండ్ తెలంగాణ మంత్రులకు బీపీ పెరిగేలా చేస్తున్నాడు.
ఇన్నాళ్లు పగ్గాలు చేతుల్లో ఉన్నా చేయని కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు ఎవరికి చేతకాకుండా చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారట.. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్దుకుంటూ ముందుకెళుతున్నాడు. ఈ మధ్య మరీ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో అధిష్టానం పిలిపించినట్టు తెలిసింది. అధిస్టానం క్లాస్ తీసుకున్నట్టు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రజాదర్భార్ పేరుతో చేసే ప్రచారం గురించి రేవంత్ రెడ్డిని అధిష్టానం నిలదీసినట్టు తెలిసింది. మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై ఫిర్యాదు చేయగా.. రేవంత్ రెడ్డి వివరణ కోరినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ అయ్యాక ఇలాంటివి వద్దని.. వ్యక్తిగత ఇమేజ్ తో పార్టీకి దెబ్బ అని రేవంత్ కు అధిష్టానం క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.