కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాగిపోతుందన్న అంచనాలు ప్రాక్టికల్ గా ఎంత కష్టమన్న విషయం కేసీఆర్ కు అర్థమవుతున్నట్లుగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తాను తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు ఒక్కొక్కరుగా లేవనెత్తుతున్న అభ్యంతరాలకు తెలంగాణ అధికారపక్షం దగ్గర సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త జిల్లాలపై తనదైన శైలిలో గళం విప్పారు. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి తాను అసెంబ్లీలో అడిగినప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని చెప్పారని.. అందుకు భిన్నంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారన్నారు. పునర్విభజన లేకుండానే ఇంత హడావుడిగా జిల్లాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలతో మొత్తం జిల్లాలు 27 అవుతున్నాయని.. వీటిల్లో ఆరు జిల్లాల్లో ఏడు లక్షల జనాభా ఉంటే.. మిగిలిన 15 జిల్లాల్లో 15 నుంచి 40 లక్షల జనాభా ఉందని.. జనాభాలో ఇన్ని తేడాలుంటే సంక్షేమ పథకాల అమలు ఎలా సాధ్యమన్నసందేహం పలువురు దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాలపై కసరత్తు సరిగా జరగలేదంటూ రేవంత్ చెబుతున్న ఉదాహరణ చూసినప్పుడు.. నిజమేనని అనిపించక మానదు. మహబూబ్ నగర్ జిల్లాకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ‘‘గండేడ్’’ మండలం ఉందని.. దాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో కలపకుండా.. గండేడ్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ లో కలపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా కలపటం వల్ల పాలనా సౌలభ్యం ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. గండేడ్ ఉదాహరణపై తెలంగాణ అధికారపక్ష నేతలు ఎవరూ నోరు విప్పని పరిస్థితి. ఇలాంటి ఉదాహరణలు.. కొత్త జిల్లా కసరత్తు మీద లెక్కలేనన్ని సందేహాలు వ్యక్తం చేసేలా చేస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.