ఉత్తమ్ వారసుడికి రంగం సిద్ధం..అతడెవరంటే?

Update: 2019-08-25 05:03 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ్ని ఎంపిక చేసే విషయంలో ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేయటమే కాదు.. ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై పూర్తి క్లారిటీతో పార్టీ అధినాయకత్వం ఉందని చెబుతున్నారు. వచ్చే నెల ఎనిమిది లోపు రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడ్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇప్పుడు పోటీ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్లు రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డిల మధ్యే ఉందని చెబుతున్నారు. దక్షిణాదిలో పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటైనే నేపథ్యంలో.. ఆ బలాన్ని నిలుపుకోవటంతో పాటు.. ఇటీవల చోటు చేసుకున్న తప్పులు జరగకుండా ఉండేందుకు చర్యల్ని షురూ చేసినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు చెబుతున్నా.. రేవంత్ రెడ్డిని ఖాయం చేసేశారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికే అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని.. అనుకోనిరీతిలో ఏదైనా జరిగితే తప్పించి.. రేవంతే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత.. పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని సోనియా నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోపార్టీ అధ్యక్ష బాధ్యతల్ని కొత్తవారికి అప్పగించాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. వాస్తవానికి ఉత్తమ్ పదవీ కాలం ముగిసినప్పటికి.. ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను కొనసాగించారు. తాజాగా ఆయన స్థానంలో రేవంత్ ను నియమించాలని అధినాయకత్వం డిసైడ్ అయ్యిందని చెబుతున్నారు. అయితే.. ప్లాన్ బి కింద జీవన్ రెడ్డిని సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అనుకోని కారణాలతో ప్రస్తుతానికి జీవన్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చినా.. ఎన్నికల నాటికి మాత్రం రేవంత్ ను అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

పార్టీ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ ఉన్నా.. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. వివిధ వడపోతల అనంతరం రేవంత్ ను ఎంపిక చేయాలని ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. యువకుడు.. చలాకీగా ఉండటంతో పాటు.. పార్టీ క్యాడర్ లో క్రేజ్ ఉండటం.. వ్యక్తిగత ఛరిష్మాతో పాటు.. క్రౌడ్ ఫుల్లింగ్ నేతగా ఉన్న రేవంత్ కు మంచి మాటకారితనం ఉండటం.. తన రాజకీయ ప్రత్యర్థుల్ని మాటలతో మంట పుట్టించేలా చేసే టాలెంట్ ఉండటంతో ఆయనకే పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News