ఆ టీ మంత్రి మున్నాబాయి ఎంబీబీఎస్ కాదట‌

Update: 2015-08-08 06:26 GMT

Full View
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి, ఆ రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ల‌క్ష్మారెడ్డి మ‌ధ్య బ‌హిరంగ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రిగింది. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మ‌ద్దూరులో నిర్మించిన ప్ర‌భుత్వ ఆసుప‌త్రి నూత‌న భ‌వ‌న నిర్మాణానికి వీరిద్ద‌రు హాజ‌ర‌య్యారు. ముందుగా మంత్రి మాట్లాడుతూ క‌మీష‌న్ల కోస‌మే ప్ర‌భుత్వం ప‌నులు చేస్తోంద‌ని... అలాగే త‌న‌ను మున్నాబాయి ఎంబీబీఎస్ అంటూ రేవంత్ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని..ఇవి స‌రికాదంటూ మంత్రి రేవంత్‌ను ఉద్ధేశించి అన్నారు.

గ‌త పాల‌కులు కేవ‌లం ఆంధ్ర ప్రాంత కాంట్రాక్ట‌ర్ల క‌మీష‌న్ల కోస‌మే ప‌నులు చేశార‌ని...తాను గుల్బ‌ర్గాలో  ఎంబీబీఎస్ పూర్తి చేశాను... దీనిపై  ఎవ‌రైనా విచార‌ణ  చేసుకోవ‌చ్చు..త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారు ఏం చ‌దువుకున్నారో చెప్పాలంటూ ప‌రోక్షంగా రేవంత్‌ ను ఎద్దేవా చేశారు. క‌మీష‌న్ల కోసం తెరాస ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌నుకుంటే ఆరువేల మెగాఓట్ల విద్యుత్ ఉత్ప‌త్తి కోసం ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ ఎల్‌ కు ఎందుకు ప‌నులు ఇస్తామ‌ని ప్ర‌శ్నించారు. అలాగే తెరాస నేత‌లెప్పుడూ ఎవ్వ‌రిపైనా వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌ని..ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసేవారికి ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెపుతార‌న్నారు.

అనంత‌రం రేవంత్ త‌న ప్ర‌సంగంలో ల‌క్ష్మారెడ్డికి   కౌంట‌ర్ ఇచ్చారు. ఈ స‌మావేశం రాజ‌కీయాలు మాట్లాడుకోవ‌డానికి కాద‌ని..ఒక వేళ రాజ‌కీయాల గురించి చ‌ర్చించుకోవాల్సి ఉంటే నీవు, సీఎం కేసీఆర్ టీడీపీలో ఉండి ప‌ద‌వులు అనుభ‌వించి వ‌చ్చిన‌వారే..మీ పార్టీ నాయ‌కుల చ‌రిత్ర‌ల‌న్ని త‌న‌కు తెలుసంటూ విరుచుకుప‌డ్డారు. దీంతో వెంట‌నే మంత్రి కూడా నోటీకి ప‌నిచెప్పారు. ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెర‌గ‌డంతో టీడీపీ, టీఆర్ ఎస్ నాయ‌కులు నినాదాల‌తో అక్క‌డ ఉద్రిక్త  ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. చివ‌ర‌కు ఇరు వ‌ర్గాల శాంతిచాయి.
Tags:    

Similar News