ఆ మధ్యన రైస్ బౌల్ ఛాలెంజ్ అని.. బాటిల్ కాప్ ఛాలెంజ్ అని.. ఆ మాటకు వస్తే ఇలాంటి చాలెంజ్ లు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మిగిలిన వారి కంటే భిన్నంగా.. సుదీర్ఘకాలంగా చాలెంజ్ నడుపుతున్న ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే.. అది టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గా చెప్పాలి. ఆయన మొదలు పెట్టిన గ్రీన్ చాలెంజ్ ను ఆయన నాన్ స్టాప్ గా కొనసాగిస్తున్నారు. ఆయన.. గ్రీన్ ఛాలెంజ్ ను గుర్తు చేస్తూ.. తాజాగా టీపీసీసీ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా వైట్ ఛాలెంజ్ ను విసిరారు.
రాజకీయంగా వేడి పుట్టిస్తున్న ఈ వైట్ ఛాలెంజ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ పై రేవంత్ ఫైర్ కావటం.. దీనికి బదులుగా ఆయన రియాక్టు కావటం.. దీనికి కొనసాగింపుగా రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేయటంతో వాతావరణం వేడెక్కింది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. రాజద్రోహం.. దేశ ద్రోహం కేసులు పెడతామని.. ఇందుకు మహారాష్ట్ర సర్కారు తమకు స్ఫూర్తి అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
దీనిపై తాజాగా రేవంత్ రియాక్టు అయ్యారు. తమ గురించి మాట్లాడితే రాజద్రోహం.. దేశ ద్రోహం కేసులు పెడతామని మంత్రి బెదిరిస్తున్నారని.. అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ కేసుల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో? ఎలాంటి చర్చ జరుగుతుందో ముందు ఆయన తెలుసుకోవాలన్న రేవంత్.. 'చట్టాలు కేటీఆర్ కు చుట్టాలు కావు. కేసులు పెడితే ఏం చేయాలో మాకూ తెలుసు' అని వ్యాఖ్యానించారు.
తాను కేటీఆర్ కు వైట్ చాలెంజ్ విసురుతున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగంపై తాను ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని.. అయితే యువతకు ఆదర్శంగా ఉండేందుకు ఈ చాలెంజ్ విసురుతున్నట్లుగా చెప్పారు. యువతకు రోల్ మోడల్ గా ఉండాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంది. అందుకే గ్రీన్ చాలెంజ్ తరహాలో వైట్ చాలెంజ్ ను స్వీకరిద్దాం. కేటీఆర్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తానీ చాలెంజ్ విసురుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ చాలెంజ్ లో భాగంగా రేపు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటల సమయానికి తాను గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని.. వారిద్దరుకూడా రావాలని.. అందరం కలిసి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు బ్లడ్ శాంపిల్స్ ఇద్దామన్నారు. బ్లడ్ శాంపిల్ తో పాటు.. వెంట్రుకలు కూడా ఇద్దామన్నారు. డ్రగ్స్ తో తనకేం సంబంధం లేదని మంత్రి అంటున్నారని.. అలాంటప్పుడు ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించటం లేదని ప్రశ్నించారు. ఇది తాను చేసిన ఆరోపణ కాదని.. ఈడీనే కోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పిందని గుర్తు చేశారు. మరి.. రేవంత్ వైట్ చాలెంజ్ కు మంత్రి కేటీఆర్.. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.