న‌డిరోడ్డుపై ఎస్పీని నిల‌దీసిన రేవంత్ రెడ్డి భార్య

Update: 2018-12-04 09:14 GMT
కాంగ్రెస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అరెస్టు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు - కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రోడ్డుపై బైఠాయిస్తున్నారు. త‌మ నేత‌ను తక్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్‌ను విడుద‌ల చేయ‌కపోతే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌తామ‌ని కూడా ప‌లువురు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు.

మ‌రోవైపు - భ‌ర్త అరెస్టుతో తీవ్ర మ‌నో వేద‌న‌కు గురైన రేవంత్ భార్య గీత ఆవేశ‌ప‌డొద్దంటూ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. ఎలాంటి హింస‌కు పాల్ప‌డొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఓటు రూపంలో కేసీఆర్ ప్ర‌భుత్వానికి దిమ్మ‌తిరిగే స‌మాధాన‌మివ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

భ‌ర్త ఆచూకీ కోసం సోమ‌వారం ఉద‌యం గీత‌ పోలీసు స్టేష‌న్‌కు వెళ్లారు. త‌న భ‌ర్తను ఎక్క‌డ దాచారో చెప్పాలంటూ నిల‌దీశారు. ఆమె వెంట కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వేలాదిగా స్టేష‌న్‌కు త‌ర‌లివెళ్లారు. దీంతో వారికి స‌ర్దిచెప్పేందుకు వికారాబాద్ ఎస్పీ అన్న‌పూర్ణ ప్ర‌య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా రోడ్డుపైనే ఎస్పీని రేవంత్ రెడ్డి భార్య ప్ర‌శ్నించారు. మీరు కూడా మ‌హిళే క‌దా.. అర్ధ‌రాత్రి భార్యాభ‌ర్త‌లు క‌లిసి గ‌దిలో ఉన్న‌ప్పుడు పోలీసులు వ‌చ్చి భ‌ర్త‌ను లాక్కెళ్లితో భార్య‌కు ఎంత వేద‌న‌గా ఉంటుందో చెప్పండ‌ని ఆమెను నిల‌దీశారు. త‌న భ‌ర్తేమీ సంఘ విద్రోహ శ‌క్తి కాద‌ని.. పారిపోయేందుకు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నించ‌లేద‌ని.. అలాంట‌ప్పుడు టెర్ర‌రిస్టులా ఎందుకంత క‌ర్క‌శంగా ఆయ‌న్ను ఈడ్చుకెళ్లారో చెప్పాల‌ని ఆవేద‌న‌తో ప్ర‌శ్నించారు.

రేవంత్ రెడ్డి భార్య ప్ర‌శ్న‌ల‌కు నే ఎస్పీ కాస్త నీళ్లు న‌మిలారు. స‌మాధానం చెప్పేందుకు త‌ట‌ప‌టాయించారు. వెంట‌నే తేరుకొని.. రేవంత్ రెడ్డి అరెస్టుపై ఏవైనా అనుమానాలు ఉంటే త‌న‌ను రాత‌పూర్వ‌కంగా ప్ర‌శ్నించాల‌ని ఆమెకు సూచించారు. తాను కూడా రాత‌పూర్వ‌కంగానే స‌మాధానాలు చెప్తానంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డిని పోలీసులు మ‌హ‌మూబ్ న‌గ‌ర్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిసింది.
Tags:    

Similar News