ఓటుకు నోటుకు కేసులో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టులో బెయిల్ లభించటం.. సాంకేతిక కారణాల వల్ల ఆయన మంగళవారం విడుదల కాకపోవటం జరిగిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పును ఉదయమే విన్న రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిపోతానన్న మూడ్‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
దీంతో.. తాను సాయంత్రం సమయానికి బయటకు వెళ్లిపోవటం ఖాయమని భావించిన నేపథ్యంలో.. అంతవరకూ తాను వాడుకున్న వస్తువులన్నింటి.. చుట్టుపక్కల ఖైదీలకు ఇచ్చేసినట్లు తెలిసింది. తన దిండు.. దుప్పటి.. బూట్లు.. తదితర సరంజామా మొత్తం రేవంత్ పలువురు ఖైదీలకు ఇచ్చినట్లు చెబుతున్నారు. అనూహ్యంగా.. ఆయనకు రావాల్సిన బెయిల్ పత్రాలు సాంకేతిక కారణం వల్ల ఆగిపోవటంతో ఆయన మంగళవారం రాత్రి జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
దీంతో.. ఆయన ఇచ్చిన వస్తువుల్ని తీసుకెళ్లిన ఖైదీలు.. ఆయన విడుదల కాకపోవటంతో ఆ వస్తువుల్ని తిరిగి ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు.. ఆ మద్య ఇఫ్తార్ విందును కూడా జైల్లో రేవంత్ నిర్వహించారని చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికి.. చర్లపల్లి జైల్లో ఉన్నది స్వల్ప కాలమే అయినా.. తన వైఖరితో పలువురు ఖైదీల మనసుల్ని రేవంత్ దోచుకున్నారని చెబుతున్నారు.