తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి డిసైడ్ కాకూడదు. అయ్యారంటే.. ఇక దాని సంగతి తేలే వరకూ ఆయన ఊరుకోరు. మనసులో ఒకసారి ఫిక్స్ అయితే.. దాని అంతు చూసే వరకూ నిద్రపోని గుణం కేసీఆర్ సొంతం. కీలకమైన ఎన్నికల వేళ.. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని కేసీఆర్ డిసైడ్ కావటం..దానికి సంబంధించిన కొన్ని అంశాల్ని ఆయన బయటపెట్టటం తెలిసిందే.
దీనిపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చెందుతున్న వైనం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఎవరూ ఊహించని రీతిలో చినజీయర్ స్వాములోరిని కలిసిన రెవెన్యూ ఉద్యోగులు.. రెవెన్యూ శాఖలో సీఎం చేపట్టిన సంస్కరణల విషయంలో పునరాలోచించుకోవాలని.. తాము ఎంతో పని చేస్తున్నామని.. అయినప్పటికీ సీఎం నిర్ణయంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవటానికి అపాయింట్ మెంట్ దొరకటం లేదని.. సంబంధిత శాఖా మంత్రి ఎవరూ లేని నేపథ్యంలో మీరే మాకు దిక్కంటూ ఆయన్ను ప్రాధేయపడటం సంచలనంగా మాత్రమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్ స్వామిని కలిసిన నేపథ్యంలో.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి వ్యక్తమైంది. అవతలోళ్లు ఆరు ఆకులు తింటే.. తాను పన్నెండు ఆకులు తినే రకమన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు. రెవెన్యూ ఉద్యోగులు జీయర్ స్వామిని కలిసి.. వినతిని అందించిన నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన వస్తుందనటానికి భిన్నంగా ఆయన అడుగు ముందుకు వేశారు.
రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి.. సంస్కరించాలని ప్రభుత్వం ఉందన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి.. అదెలా చేయాలనుకుంటున్నామన్న విషయాన్నిఆయనకు చెప్పినట్లుగా తెలిసింది. ఇందుకోసం ఏకంగా మూడున్నర గంటల పాటు గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్.. పలు అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.
తాజా పరిణామంతో రెవెన్యూ ఉద్యోగులకు స్వాములోరు ఇచ్చిన అభయం ముందుకు వెళ్లని పరిస్థితి. వెనక్కి అడుగు వేయలేనంత ముందుకు వెళ్లిపోయారన్న సంకేతాన్ని కేసీఆర్ తన తాజా చర్యతో ఇచ్చేయటమే కాదు.. మంచి చేయాలనుకున్నప్పుడు ఎవరూ దారికి అడ్డురాకూడదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
ప్రజలకు మేలు జరిగేలా.. లంచాల బెడద లేకుండా చేసేందుకు వీలుగా సంస్కరణలు రానున్నాయన్న మెసేజ్ ను తన తాజా చర్యతో తేల్చేసిన కేసీఆర్.. రెవెన్యూ ఉద్యోగులకు ఊహించని షాకిచ్చినట్లే. అనవసరమైన వృధా ప్రయత్నాల్ని ఆపేసి.. కేసీఆర్ కోరుకున్నట్లుగా మార్పుల్ని ఆహ్వానించేందుకు మానసికంగా సిద్ధం కావాలన్న సందేశాన్ని తన తాజా చర్యలతో కేసీఆర్ స్పష్టం చేశారని చెప్పక తప్పదు. కేసీఆరా మజాకానా?