బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. ఆ వీడియో, ఫొటోలు వైరల్

Update: 2023-01-18 07:17 GMT
రాంగోపాల్ వర్మ.. వివాదాస్పద దర్శకుడే కాదు.. ఆయన సమకాలీన రాజకీయాలు, సామాజిక సమస్యలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ రోజూ వార్తల్లో నానుతుంటారు. వర్మ చేసే పనులన్నీ కూడా గిచ్చి కయ్యం పెట్టుకునేలానే ఉంటాయి. ఎప్పుడూ ఎవరినో ఒకరిని కెలకనిదే ఆయనకు నిద్ర పట్టదు. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన వీడియో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తోటి విద్యార్థినిపై బండి భగీరథ్ దూషిస్తూ శారీరకంగా దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ అంశం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ వీడియోను బీఆర్‌ఎస్ నేతలు ఆయుధంగా మార్చుకుని సంజయ్‌పై దాడికి దిగుతున్నారు. ఈ విషయంపై రాజకీయ నాయకులు స్పందిస్తున్న తరుణంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు.

సమాజంలో జరిగే ప్రతి సమస్యపై తనదైన శైలిలో స్పందించే రాంగోపాల్ వర్మ బండి భగీరథ వీడియోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. 'ఒకప్పుడు ఇరాక్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్ కాలం పోయింది. అయితే ఇప్పుడు మళ్లీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథుడి రూపంలో పుట్టాడు' అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. రాజకీయ నాయకులకు దూరంగా ఉంటానని వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. తాజాగా బండి బగీరథ్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ దుమారం రేపారు.. రాజకీయ డైలాగులు పేల్చి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇక వర్మ చేసిన పోస్ట్ కొందరు కౌంటర్ గా ట్రోల్స్ చేస్తున్నారు. 'అషురెడ్డి కాళ్ల దగ్గర నాకేస్తావ్ నువ్వు చెబుతున్నావా? అంటూ ' ఆ ఫొటోలను పెట్టి కౌంటర్ ఇస్తున్నారు. ప్రతీదాంట్లో వేలు పెట్టడం మానేసి నిజాలు తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో అంటూ వర్మ హితవు పలుకుతున్నారు.

కాగా, తన కుమారుడి వీడియోకు సంబంధించి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పిల్లలతో రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. తన కుమారుడిపై కేసు నమోదు చేయడంపై ఆయన సీరియస్‌గా స్పందించారు. తనతో రాజకీయాలు చేయకూడదని, పిల్లలతో రాజకీయం చేయించాలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పిల్లలను కొడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. గతంలో సీఎం మనుమడిపై వ్యాఖ్యలు చేస్తే తానే ఖండించానని, ఇప్పుడు ఆ ఘటనపై ఎలాంటి కేసులు పెడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

ప్రస్తుతం బండి సంజయ్ కొడుకు దాదాగిరీ అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్లు చేస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బండి సంజయ్ కుమారుడు మందు పార్టీలో ఉన్న ఫొటోలను షేర్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Tags:    

Similar News