ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల ఫ్రస్ట్రేషన్ రెట్టింపవుతోంది.. నోళ్లకు అడ్డేలేకుండా పోతోంది. రాజకీయ - విధాన లోపాలపై విమర్శలను దాటి వ్యక్తిగత ఆరోపణలు - వ్యక్తిగతంగా అవమానించే వ్యాఖ్యలతో చిల్లర రాజకీయాలకు దిగుతున్నారు. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రధాని మోదీ - యూపీ సీఎం యోగి - కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని లక్ష్యంగా చేసుకుని ఆయన తన నోటకి పనిచెప్పారు. మోదీని ఎద్దుతో పోల్చిన ఆయన యోగి ఆదిత్యానాథ్‌ను దూడగా అభివర్ణించారు. ఇక కేంద్రమంత్రి స్మృతి ఇరానీని బలిష్టమైన ఆవు అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కోసీకలాన్ లో రైతులతో చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ప్రజలకు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనమే. మీ ఆవులు - ఎద్దులు - దూడలు ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తాపత్రికల్లో చూస్తున్నాను. వాటిని మీరు స్కూళ్లు - కాలేజీ భవనాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ–యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిష్టమైన ఆవు ఒకటి వచ్చిందని చెబుతున్నారు. స్మృతీ ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారు’ అని అజిత్ సింగ్ వ్యాఖ్యానించారు.
కాగా దేశంలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆయన ఇంతగా దిగజారి వ్యాఖ్యలు చేసిన చరిత్ర లేదు. పదునైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నప్పటికీ ఇలా మహిళలపట్ల బాడీ షేమింగ్ చేస్తూ మాట్లడినట్లుగా లేదు. మోదీతో రాజకీయ విభేదాలున్నప్పటికీ మోదీ పట్ల కూడా ఇలా ఎన్నడూ అజిత్ సింగ్ వ్యాఖ్యలు చేయలేదు.
ముఖ్యంగా మహిళా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీది భారీ కాయం కావడంతో ఆమెను అలా బలిష్టమైన ఆవు అని అనడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా అజిత్ సింగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
Full View