మా తాత జైలు జీవితం గడిపింది ఇందుకేనా?..మోడీకి అమెరికా చట్ట సభ సభ్యుడి కౌంటర్!
ప్రధాని మోడీని దూషించారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వెనువెంటనే లోక్ సభ సెక్రటేరియట్ స్పందించి రాహుల్ ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించింది. దీనిపై దేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది.
ఇప్పటికే ఈ దేశం కోసం తమ కుటుంబం ప్రాణాలను బలి ఇచ్చిందని రాహుల్ సోదరి ప్రియాంక వెల్లడించిచారు. ఈ క్రమంలో అమెరికా చట్ట సభ సభ్యుడొకరు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవడం విశేషం. ప్రధాని మోడీ వ్యవహార శైలిని ఆయన పరోక్షంగా తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ట్విటర్ వేదికగా రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ఈ మేరకు భారత – అమెరికన్ సభ్యుడు రో ఖన్నా ట్వీట్ చేశారు. రాహుల్ అనర్హత గురించి ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ రో ఖన్నా ఈ వ్యాఖ్యలు చేశారు.
'రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేయడం.. గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుంది. మా తాతయ్య (అమర్ నాథ్ విద్యాలంకార్) ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది' అని అంటూ ప్రధాని నరేంద్ర మోదీని రో ఖన్నా ట్యాగ్ చేశారు.
కాగా రో ఖన్నా తాత అమర్ నాథ్ విద్యాలంకార్.. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిషర్లతో పోరాడారు. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్‌తో కలిసి విద్యాలంకార్ పనిచేశారు. ఈ క్రమంలో లాలా లజపతిరాయ్ తోపాటు విద్యాలంకార్ కూడా కొన్నేళ్లపాటు జైలుశిక్షకు గురయ్యారు.
ఈ నేపథ్యంలోనే అమెరికా చట్ట సభ సభ్యుడు రో ఖన్నా స్పందించారు. న్యూయార్క్ టైమ్స్ లో ఈ మేరకు వచ్చిన కథనంపై స్పందించిన రో ఖన్నా ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పై వేటు వేయడమంటే గాంధీ సిద్ధాంతాలకు, భారతదేశ విలువలకు తీవ్ర దోహ్రం చేయడమే అవుతోందన్నారు. ఈ మేరకు నేరుగా ప్రధాని మోడీకి తన ట్వీటును ట్యాగు చేశారు.
కాగా, రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చే స్తూ లోక్ సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.