మక్కాలో చోటు చేసుకున్న మహా విషాదం మొత్తం మానవ తప్పిదమా? లేక.. వీవీఐపీ సంస్కృతా? సౌదీ అధికారుల వైఫల్యమా? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. విస్మయకర విషయాలు బయటకు వస్తున్నాయి. సౌదీ రాజకుమారుడి కాన్వాయ్ కారణంగానే ఈ భారీ విషాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. మక్కాలో చోటు చేసుకున్న తాజా తొక్కిసలాటలో 717 మంది హజ్ యాత్రికులు మరణించారు.
ఇంత భారీగా యాత్రికులు మరణించటానికి ప్రిన్స్ సల్మాన్ వైఖరే అని లెబనాన్ కు చెందిన మీడియా ఒకటి పేర్కొంటోంది. దాని కథనం ప్రకారం.. యాత్రికుల సంఖ్యను లెక్క చేయకుండా.. భారీ కాన్వాయ్ తో మీనా చేరుకున్నారని.. ఆయన వస్తున్నారన్న కారణంగా యాత్రికుల నడక దిశను మార్చినట్లుగా పేర్కొంది. దే మహా విషాదానికి కారణంగా చెబుతున్నారు.
మరోవైపు మక్కాలో చోటు చేసుకున్న భారీ తొక్కిసలాటపై ఇరాన్ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీ చేతకానితనం వల్లే ఇంత మంది మరణించారని తిట్టిపోసింది. మొత్తానికి మరో వీవీఐపీ కారణంగా అమాయకులైన వందలాది మంది భక్తులు మరణించటంపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది.