ఒక ట్రావెల్ఏజెన్సీ యజమాని ప్రదర్శించిన బలుపు ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తుంది. ఇతగాడి నిర్వాకం అంతా సీసీ కెమేరాలో నిక్షిప్తమై బయటకు వచ్చింది. ఒక ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారి ఇంత రాక్షసంగా వ్యవహరిస్తారా? అని షాక్ తింటున్నారు.
ఇంతకీ అతగాడు చేసిందేమంటే.. ముంబయిలో తన స్విఫ్ట్ కారులో వెళుతున్న అబ్దుల్ రషీద్ కారును ఓ వోల్వో బస్సు డ్రైవర్ తాకించాడన్నది ఆరోపణ. అంతే.. తన కారును ఆపిన రషీద్.. క్రికెట్ బ్యాట్.. స్టంపుల సాయంతో వోల్వో బస్సు అద్దాలు పగలగొట్టాడు. ఆ తర్వాత డ్రైవర్ నుకొట్టాడు. అతడు ఆ దెబ్బల్ని తట్టుకోలేక పారిపోతుంటే.. అప్పటికి వదల్లేదు. అతని దెబ్బలకు.. బస్సులో నుంచి తన కారు మీద పడిపోతే.. అలానే దూసుకుపోయాడు.
ఈ సందర్భంగా కారు మీద నుంచి జారి పడిన డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇతగాడి దుందుడుకుతనాన్ని అడ్డుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించినా ఏ మాత్రం లెక్క చేయలేదు. చివరకు ఇతగాడి బలుపును సీసీ కెమేరాల్ని చూసి.. అతగాడి చిరునామా ఆధారంగా అరెస్ట్ చేశారు. ఇలాంటి బలుపుగాళ్ల వ్యవహారాన్ని పోలీసులు అన్ని కోణాల్లో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.