అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టైమ్ చాలా బ్యాడ్‌గా నడుస్తోంది. మరో కొద్ది నెలల్లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగనున్న ఆయనకు అడుగడుగునా ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. స్వదేశంలో ఆయనకు ఓ రేంజ్ ఉన్నా.. ఇప్పుడు ఆయన విదేశాల్లో చాలా చులకనవుతున్నారు. మొన్నటికి మొన్న జీ-20 దేశాల సదస్సుకోసం చైనా వచ్చిన ఒబామాను కమ్యూనిస్టు ప్రభుత్వం డామ్ ఇన్ సల్ట్ చేసింది. బీజింగ్ ఎయిర్ పోర్టులో ఒబామాకు జరిగిన ఘోర అవమానంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. విమానం నుంచి గౌరవ ప్రదంగా కిందికి దిగేందుకు అవకాశం కల్పించకుండా అత్యవసర మార్గం ద్వారా ఒబామా దిగేలా చైనా అధికారులు వ్యవహరించారు.
ఆ తర్వాత కూడా రెడ్ కార్పెట్ పరచకుండా అవమానించారు. ఇక క్యూబా వెళ్లిన ఒబామాను రిసీవ్ చేసుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు సైతం రాలేదు. ఇక, ఇప్పుడు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఒబామాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత దారుణంగా ఉన్నాయి. వాస్తవానికి లావోస్ లో జరిగే దక్షిణాసియా దేశాధినేతల వార్షిక సదస్సు సందర్భంగా తొలిసారి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో- ఒబామా భేటీ కావాల్సి ఉంది. దీనికి గతంలో షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇంతలోనే రోడ్రిగో నోటికొచ్చినట్టు ఒబామాపై విరుచుకుపడ్డారు. ఒబామా ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు. ఆ వెంటనే ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రోడ్రిగో విచారం వ్యక్తం చేశారు.
అయితే, ఎంత కూల్ గా ఉండే వాళ్లకైనా ఈ మాట మండిపోయేలా చేస్తుంది కదా! ఒబామా కూడా అంతే ఫైరయ్యారు. కానీ, ఆయన ఎక్కడా బయట పడలేదు. కానీ, రోడ్రిగోతో జరగాల్సిన భేటీని సడెన్ గా రద్దు చేసుకున్నారు. నిజానికి చెప్పాలంటే ఫిలిప్పీన్స్ కి అధ్యక్షుడు అయిన తర్వాత రోడ్రిగో రెచ్చిపోతున్నారు. మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నామనే నెపంతో పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడంతో పాటు మాదక ద్రవ్యాల పేరు ఎత్తేవారిని కాల్చి చంపాలని, అలా చేయని అధికారులను తాను కాల్చి చంపుతానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఫిలిప్పీన్స్ రణరంగాన్ని తలపిస్తోంది.