వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఏది మాట్లాడినా ప్రత్యేకమే. రోజా ధాటికి తట్టుకోలేక టీడీపీ ప్రభుత్వం ఆమెను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు తాజా ఎన్నికల్లో రోజా రెండో సారి విజయం సాధించడం - వైసీపీ అధికారంలోకి రావడంతో... ఇక రోజాపై పైచేయి సాధించడం కష్టమే. నిజమే... ఈ భావన కరెక్టేనన్నట్లుగా నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు సర్కారుపై తన అక్కసును వెళ్లగక్కిన రోజా... తనను ఇబ్బందులు పెట్టిన వైనాన్ని కూడా ప్రస్తావించారు. తాజాగా శుక్రవారం నాటి సమావేశాలకు హాజరైన సందర్బంగా రోజా ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీని పూర్తి చేయాలంటే... చంద్రబాబు సారీ చెప్పాలంటూ ఆమె నిజంగానే ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
చంద్రబాబు సారీ చెబితే... రైతుల రుణమాఫీలో మిగిలిన సాయాన్ని విడుదల చేసే విషయంపై జగన్ ఆలోచిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేదో బోడిగుండుకు - మోకాలికి లంకె పెట్టినట్టుగా అనిపిస్తున్నా... రోజా కామెంట్ వైరల్ గా మారిపోయింది. 2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొత్తం ఐదు విడతల రుణ మాఫీలో మూడు విడతలను విడుదల చేసిన చంద్రబాబు మిగిలిన నాలుగు - ఐదు విడతల సొమ్మును విడుదల చేయలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన రోజా... తాను ఇచ్చిన మాటను తప్పానంటూ చంద్రబాబు సారీ చెబితే... మిగిలిపోయిన రుణమాఫీ సొమ్మును విడుదల చేసే దిశగా జగన్ ఆలోచిస్తారని రోజా చెప్పుకొచ్చారు. మాట తప్పానని బాబు సారీ చెబితేనే... టీడీపీ హామీ ఇచ్చిన రుణమాఫీ పై జగన్ పరిశీలన చేస్తారని ఆమె చెప్పారు.
ఓ వైపు చంద్రబాబు పథకాలన్నింటినీ రద్దు చేసుకుంటూ పోతున్న జగన్... ఇప్పటికే ఎన్నికల ముంగిట చంద్రబాబు ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవను వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చేశారు. ఇలాంటి నేపథ్యం అమలు సాధ్యం కాదని 2014 ఎన్నికల నాడే క్లారిటీగా చెప్పేసిన జగన్... ఇప్పుడు చంద్రబాబు సారీ చెబితే మాత్రం మిగిలిపోయిన రుణమాఫీని పూర్తి చేస్తారా? ముమ్మాటికీ చేయరనే చెప్పాలి. మరి రోజా ఈ వ్యాఖ్య ఎందుకు చేసినట్టు? గత ప్రభుత్వం ప్రారంభించి అమలు చేసిన పథకాలను ఇప్పటి ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కదా. ఆ డిమాండ్లకు కౌంటర్ గానే రోజా... చంద్రబాబు సారీని - జగన్ సాయాన్ని ప్రస్తావించారన్న మాట.