టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ కీలక నేత - ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ రేంజిలో ఫైరయ్యారు. నేటి ఉదయం విజయవాడకు వచ్చిన రోజా.... అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ సర్కారు తీరు - చంద్రబాబు వ్యవహార సరళి - ఇటీవల నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు... మహిళా పార్లమెంటును కిట్టీ పార్టీలా మార్చేశారని ఆరోపించారు. తాము గొప్పగా నిర్వహించామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్న మహిళా పార్లమెంటు సదస్సును జాతీయ మీడియా ఏకిపారేసిందని కూడా రోజా గుర్తు చేశారు. సదస్సుకు అర్హత కలిగిన వారిని పిలవాల్సిన చంద్రబాబు సర్కారు... భజనపరులనే సదస్సుకు ఆహ్వానించిందని ఎద్దేవా చేశారు. సదస్సుకు హాజరుకావాల్సిన వారు ఎంతో మంది ఉండగా... టీడీపీ నేతలకు మాత్రం.... వెంకయ్య కూతురు - కేసీఆర్ కూతురు - చంద్రబాబు కోడలు మాత్రమే గుర్తుకు వచ్చారని నిందించారు. ఈ ముగ్గురికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పార్లమెంటు సదస్సుకు తనను ఆహ్వానించిన ప్రభుత్వం తనను ఉద్దేశపూర్వకంగానే అవమానపరచిందని మండిపడ్డారు. తనకు జరిగి అవమానంపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు రాక్షస పాలనపై పోరాటం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళా పార్లమెంటుకు వెళుతున్న తనను అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా... పోలీసులు చంద్రబాబుకు బౌన్సర్లుగా మారిపోయారని ఆరోపించారు. చంద్రబాబే పోలీసులను బౌన్సర్లుగా వాడుకుంటున్నారని కూడా ఆమె వ్యాఖ్యానించారు. స్పీకర్ ఆహ్వానం మేరకే తాను మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకే వెళ్లానని చెప్పిన రోజా... స్పీకర్ నుంచి తనకు ఏకంగా రెండు ఆహ్వానాలు అందాయని రోజా చెప్పారు.
స్పీకర్ నుంచి రెండు ఆహ్వానాలు అందితేనే తాను సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆహ్వానం పంపి - ఆపై సదస్సుకు వెళుతుంటే తనను అడ్డుకోవడమంటే... తనను ఉద్దేశపూర్వకంగానే అవమానించినట్లు కాదా అని ప్రశ్నించారు. అసలు తనను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు టీడీపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పుట్టిన తనకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా అని కూడా రోజా ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు ఉంటున్న విజయవాడలోనే 70 రేప్ లు జరిగాయన్నారు. మహిళలపై నేరాలను సహించేది లేదని బీరాలు పలుకుతున్న డీజీపీ సాంబశివరావు విజయవాడలో జరిగిన రేప్ లపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కర్నూలులో టీడీపీ నేతలు ఓ మహిళపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారని చెప్పిన రోజా... దానిపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/