తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికరంగా స్పందించారు. తెలంగాణాలో ప్రజాకూటమి ఓటమికి కారణమని రోజా అన్నారు. ఇవాళ గుంటూరులో ఆమె మాట్లాడుతూ 'కాంగ్రెస్ తో కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ప్రజలు దాన్నే నిజంచేశారు. టీడీపీ-కాంగ్రెస్ కలిస్తే ఉరేసుకుంటానని కేఇ కృష్ణమూర్తి అన్నారు. కాంగ్రెస్ ను టీడీపీని కలిపి తెలంగాణ ప్రజలు ఉరేశారు' అని రోజు విమర్శించారు. నందమూరి ఫ్యామిలీని రాజకీయంగా సమాధి చేయాలన్న కుట్రకు తెర లేపి సుహాసినిని పోటీకి దించారని.. బాబు కుట్రను జూనియర్ ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ లు గుర్తించారని ఆమె అన్నారు. తెలంగాణలో ఫలితాలు చూసి ఏపీ ప్రజలు సంతోషపడ్డారని చెప్పారు.
``తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానకి చంద్రబాబే కారణం. లగడపాటితో సర్వేపేరుతో చంద్రబాబు కుట్రలు చేసి డబ్బుకట్టలతో గెలవాలనుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను తికమకపెట్టడానికి లగడపాటిని ప్రవేశపెట్టారు. మీరు చేసిన నీతిమాలిన రాజకీయాలకు బుద్ది చెప్పడానికి తెలంగాణా ప్రజలు కంకణం కట్టుకున్నారు. అది వారిచ్చిన తీర్పు ద్వారా నిరూపితమైంది.``అని రోజా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``విజయమాల్యా - సుజనాచౌదరి లాగా కాంగ్రెస్-టీడీపీలను గెలిపించేసి ఏదోవిధంగా అప్పులు ఎగ్గోట్టాలనే ప్రయత్నం లగడపాటి చేస్తున్నారు. లగడపాటి మాటలు చూస్తే రాజకీయబ్రోకర్ లా గా కనిపించింది. రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి సర్వేల సన్యాసం చేస్తే బాగుంటుంది. తమిళనాడు - తెలంగాణాలో లగడపాటి సర్వేల గురించి ఛూశాం. ఆంధ్రలో ఆయన సర్వేలను పట్టించుకునే పరిస్దితి లేదు.`` అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రోజా సెటైర్లు వేశారు. ``పప్పు ఈరోజు చాలా హ్యాపిగా ఉంటాడు.నేను తెలంగాణాకు వెళ్లినప్పుడే ఒకటన్నా వచ్చింది. చంద్రబాబు వెళ్లి నిండాముంచారనే ఆనందంతో ఉండి ఉంటాడు. చంద్రబాబును - పప్పును ఇక ఓఎల్ ఎక్స్ లో పెట్టి అమ్మాల్సిందే. నందమూరి ఫ్యామిలిని సమాధి చేయాలన్న కుట్రకు తెరలేపి నందమూరి సుహాసిని ఎన్నికలకు తీసుకువచ్చి బలి చేశారు. చంద్రబాబు కుట్రను జూనియర్ ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ లు గుర్తించారు. తెలుగుదేశాన్ని నీవు కాపాడలేకపోతున్నావు ఇక దేశాన్ని ఏం కాపాడతావని చంద్రబాబుకు తెలంగాణా ప్రజలు బుధ్ది చెప్పారు. కూకట్ పల్లి -మల్కాజ్ గిరి - శేర్ లింగంపల్లిలలో ఆంధ్రావాళ్లు ఎక్కువ ఉంటారు.అక్కడి ప్రజలు చంద్రబాబు అవినీతి - దోపిడిని గురించి వినేవారు ఇంత చిత్తుగా ఓడించారు. చంద్రబాబు అరాచకాలను కళ్లారా చూసిన ఆంధ్రా ప్రజలు అవకాశం వస్తే తరిమికొడతానికి సిధ్దంగా ఉన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును తెలంగాణా ప్రజలు 40 అడుగుల గోతి తీసి పాతిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏపి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి.`` అని రోజా కోరారు.