గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాదులో జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే పలు దఫాలుగా సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలను ఎలా ఎదుర్కోవాలి - ఏయే అంశాలు చర్చకు రావాలి అని పార్టీ నాయకులు విడతలుగా చర్చించారు. తాజాగా మంగళవారం మళ్లీ తెదేపా నాయకులు చంద్రబాబునాయుడుతో సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడుతారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. నాయకుల ప్రెవేటు సంభాషణల్లో మాత్రం రోజా మీద సస్పెన్షన్ వ్యవహారం బాగానే చర్చకు వస్తున్నదట. ఆమె స్పీకరుకు క్షమాపణ లేఖ కూడా రాసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. రోజా మీద సస్పెన్షన్ ఎత్తేస్తారా లేదా? అనేది ఇప్పుడు తెదేపా వర్గాల్లో కీలకంగా జరుగుతున్న చర్చ. రోజాను సభకు అనుమతిస్తే గనుక.. మళ్లీ తమకు నానా పాట్లు ఉంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సారిగా స్వరం పెరుగుతుందని.. వారి మాటల దాడిని తట్టుకోవడం కష్టమైపోతుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు.
రోజా మీద సస్పెన్షన్ నేపథ్యంలో ఆమె టెక్నికల్ గా అసెంబ్లీకి రాకుండ సభ బయట ఉన్నారు తప్ప.. తెలుగుదేశాన్ని విమర్శించడం - తిట్టిపోయడం విషయానికి వస్తే.. సభలో ఉంటే ఎంత గొడవ జరుగుతుందో బయటకూడా అంతే రచ్చ జరుగుతోందని నాయకులు తమలో తాము వ్యాఖ్యానించుకుంటున్నారట. రోజా సభలోకి రాగానే.. ఒకసారి సస్పెండ్ చేసినందుకు జడిసి - ఇక నెమ్మదిగా నడుచుకునే రకం ఎంతమాత్రమూ కాదని.. తిరిగి తన పాత జోరునే కొనసాగిస్తుందని.. ఇంకా రెచ్చిపోయి ప్రతిస్పందించినా జరగవచ్చునని ఊహిస్తున్నారట. అందుకే రోజా దెబ్బ అసెంబ్లీలో తప్పించుకోవాలంటే.. వైకాపా బలాన్ని కాస్త పలచన చేయాలంటే.. ఆమె సభలోకి రాకుండా చూడడమే మేలని తమలో తాము వ్యాఖ్యానించుకుంటున్నారట.