వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ లో కూడా తమ అదృష్టాన్ని బలాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఎన్నికలో ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది? నామమాత్రపు ఓట్లయినా లభిస్తాయా లేదా అనేదానిని బట్టి.. భవిష్యత్తులో తెలంగాణ మీద తాము ఆశలు పెట్టుకోవచ్చునో లేదో వారు నిర్ణయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఆ పార్టీ తరఫున వరంగల్ ఎన్నికల బరిలో దిగిన నల్లా సూర్యప్రకాశ్ తన శక్తివంచన లేకుండా సీరియస్ గానే పోరాడడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారం విషయంలో వైకాపా ఫైర్ బ్రాండ్ రోజాను తీసుకువస్తే గనుక.. తమకు ఎడ్వాంటేజీ ఉంటుందని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారానికి పార్టీ అధినేత జగన్, ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా రాబోతున్నారని నల్లా సూర్యప్రకాశ్ అక్కడి కార్యకర్తలకు తెలియజేశారు. మొత్తానికి వరంగల్ ఎన్నికల ప్రచారంలో దాదాపుగా అన్ని పార్టీలు కూడా తెలంగాణలో ఇమేజి ఉన్న నాయకుల ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వైకాపా అభ్యర్థి మాత్రం ఏపీలో క్రేజ్ ఉన్న నాయకులను తన అస్త్రాలుగా ఎంచుకోవడం విశేషం. జగన్ అంటే పార్టీ అధినేత గనుక.. ఆయన ప్రచారం కీలకమే అనుకోవచ్చు. అయితే రోజాను ఎంచుకోవడంలోనే కీలకం ఉన్నదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
నిజానికి వైకాపా అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ రోజాను తన ప్రచారానికి తురుపుముక్కగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ మీద విరుచుకుపడడంలో వైకాపా ఎమ్మెల్యే రోజాకు ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. గతంలో ఆమె చేసిన విమర్శలు 'రాత్రి బార్లు.. పగలు దర్బార్లు' అనేదే ఇవాళ్టి వరకు కేసీఆర్ మీద వచ్చిన అత్యంత క్రేజీ విమర్శగా చెలామణీలో ఉన్నది. అప్పట్లో ఉద్యమంలో ఉన్న కేసీఆర్ పై రోజా విమర్శలు చేసిన నేపథ్యం వేరు కావొచ్చు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు వచ్చి ఉండొచ్చు. కానీ కేవలం సినీనటిగా, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా.. రాజకీయంగా ప్రత్యర్థులపై తీవ్రపదజాలంతో విరుచుకుపడే నాయకురాలిగా క్రేజ్ ఉన్నది గనుక.. నల్లా సూర్యప్రకాశ్ ప్రత్యేకంగా రోజాను ప్రచారానికి తీసుకువెళుతున్నట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. రోజా ప్రచారం వల్ల.. నల్లాకు ఎంతలాభం జరుగుతుందో చూడాలి.