రోజా... నీకెవ్వరూ సరిలేరమ్మ !

Update: 2020-04-13 11:30 GMT
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కూడా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ చేస్తుంది. రసాయనాలతో పాటూ బ్లీచింగ్ కూడా చల్లుతున్నారు. మున్సిపల్ సిబ్బంది గత రెండు వారాలుగా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే , పారిశుధ్య కార్మికులకు , ప్రజలకి అవగాహన కల్పించేందుకు అక్కడక్కడా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు కూడా శానిటైజేషన్‌ లో భాగస్వామ్యం అవుతున్నారు.

తాజాగా నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీసీ ఛైర్మన్ రోజా కూడా శానిటేషన్‌ లో భాగస్వామ్యం అయ్యారు. వడమాల గ్రామంలో ఓ యువకుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌ గా అధికారులు ప్రకటించారు. దీనితో కరోనా పాజిటివ్ నమోదైన వడమాలలో ఆమె స్వయంగా సోడియం  హైపో క్లోరైడ్ పిచికారీ చేశారు. అలాగే ఎంపీడీవో కార్యాలయం లో అధికారులతో సమావేశం నిర్వహించిన రోజా కరోనా వచ్చిన యువకుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు.

అలాగే, మరోవైపు నగరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రతి రోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. నగరి మున్సిపల్‌ పరిధి సత్రవాడ 18,19 వార్డుల్లోని 500 కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్కేరోజా కూరగాయలు అందజేశారు. అలాగే అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
Tags:    

Similar News