అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. ఆ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏపీ అధికారపక్షంపై ఒత్తిడికి గురి చేయటం.. తమపై ఏపీ ప్రజల్లో మరింత సానుభూతి వెల్లువెత్తేలా చేసేందుకు వచ్చిన అవకాశాన్ని ఆమె ఏమాత్రం విడిచిపెట్టటం లేదు. తనపై ఏపీ అసెంబ్లీ విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్న ఆమె.. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించటం.. దీనికి అసెంబ్లీ మార్షల్స్ ఒప్పుకోకపోవటం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ అనుసరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె.. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు గాంధీ విగ్రహం వద్దకు వచ్చి నిరసన చేపట్టారు. ఎండ చురుక్కుమంటున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. పట్టుదలతో అలానే కూర్చొంచిపోయారు. అయితే.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె చాలా త్వరగా నీరసించిపోయారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే.. ఆమెను 108లో నిమ్స్ కు తరలించారు.
ఒక మహిళా ఎమ్మెల్యేను కోర్టు అనుమతి పొందిన తర్వాత కూడా సభకు అనుమతించకపోవటమే కాదు.. ఆమె నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు.. కనీస సదుపాయాలు కల్పించకుండా.. ఆమె సొమ్మసిల్లిపోయే వరకూ ఏపీ సర్కారు స్పందించని వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారికి కావాల్సింది ఇలాంటి పరిస్థితే కదా. రోజా ఎపిసోడ్ తో ఇబ్బంది పడుతున్న ఏపీ సర్కారుకు.. తాజా పరిణామం మరికాస్త ఇబ్బందికి గురి చేయటం ఖాయమని చెప్పక తప్పదు.