ఏపీ అసెంబ్లీ స్పెషల్-1

Update: 2017-03-06 07:23 GMT
తెలుగువారి నూతన రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలకు తాత్కాలిక అసెంబ్లీ భవనం వేదికవుతోంది.  వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాల్లోనే ఈ అసెంబ్లీ భవనాలనూ  నిర్మించారు.  రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండున్నరేళ్ళు దాటినా ఇంతవరకు  హైదారాబాద్‌లోనే అసెంబ్లి సమావేశాల్ని నిర్వహించారు. అయితే.. పాలన సొంతగడ్డకు మార్చిన నేపథ్యంలో చట్టసభలనూ స్వరాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించారు.  ఈ నెల 2న ఈ భవనాల్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
    
కొత్త భవనంలో సమావేశాలను సోమవారం ఉదయం 11.06 గంటలకు ప్రారంభిస్తున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వాగత కార్యక్రమంతో  మొదలుపెట్టనున్నారు. తొలిప్రసంగం గవర్నర్‌ విఎస్‌ఎల్‌ నరసింహన్‌ చేస్తారు.
    
ఎంట్రీ ఇలా...
    
కొత్త అసెంబ్లీలో మొత్తం  మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలుంటాయి.

1వ ద్వారం నుంచి : శాసనమండలి చైర్మన్‌ - అసెంబ్లి స్పీకర్‌ - ముఖ్యమంత్రి

2వ ద్వారం నుంచి: మంత్రులు - ప్రతిపక్షనాయకులు

3వ ద్వారం నుంచి: మీడియా ప్రతినిధులు - అధికారులు

4వ ద్వారం నుంచి : ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు

5వ ద్వారం నుంచి : సీనియర్‌ అధికారులు - అసెంబ్లి సిబ్బంది.

సందర్శకుల కోసం: విద్యార్ధులు - ఎన్‌ జిఓలకు ప్రత్యేక గాలరీలేర్పాటు చేశారు. ముందస్తు అనుమతితో వారు అసెంబ్లి సమావేశాల్ని చూసే వీలుంటుంది.

మీడియా ప్రాంగణం : అసెంబ్లి భవనాని కెదురుగా మీడియా పాయింట్‌ నెలకొల్పారు. ఇందులో ప్రజాప్రతినిధులు - లెజిస్లేచర్‌ పార్టీ నాయకులు తమ అభిప్రాయాల్ని మీడియాకు వ్యక్తం చేసే వీలుంటుంది.

పార్కింగ్‌ : అసెంబ్లి భవనాల పక్కనే సుమారు ఐదెకరాల్లో వాహనాల పార్కింగ్‌ ను నెలకొల్పారు. ఇందులో వెయ్యికి పైగా వాహనాల్ని పార్కింగ్‌ చేసుకోవచ్చు.

అసెంబ్లీకి రెండు దారులు..?

విజయవాడ నుంచి రెండు ప్రధాన మార్గాలు: అసెంబ్లి సమావేశాలకు హాజరయ్యే వారికోసం విజయవాడ నుంచి వెలగపూడి వరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రెండు ప్రధాన మార్గాల్ని సిద్దం చేశారు.

మార్గం 1: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా కరకట్టా - వెంకటపాలెం చెక్‌పోస్ట్‌, మందడం, మల్కాపురం జంక్షన్‌ మీదుగా వెలగపూడి అసెంబ్లి భవనాలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మార్గంలోనే అసెంబ్లి సమావేశాలకు హాజరౌతారు.

మార్గం 2: ఉండవల్లి - మంగళగిరి - కృష్ణాయ పాలెం మీదుగా వెలగపూడి అసెంబ్లి భవనాలు

ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు, అధికారులను ఈ మార్గంలో అనుమతిస్తారు. ఈ మార్గంలో వెళ్ళే వాహనాలు అసెంబ్లికేర్పాటు చేసిన నాలుగో ప్రధాన ద్వారం వద్దకు నేరుగా చేరుకుంటాయి. మార్గమధ్యంలో 29గ్రామాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News