ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అఫ్గాన్ వ్యవహారం భారత్ కు కొత్త తలనొప్పుల్ని తీసుకొస్తోంది. అనుకున్న దాని కంటే దాని దెబ్బకు భారత్ మరింతగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడినట్లుగా చెప్పాలి. అఫ్గాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవటం.. వారి చేతికి దేశీయ ఆయుధ సంపత్తి మొత్తం గుప్పిట్లోకి రావటం పలు దేశాల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. గతానికి మించి దాదాపు పది నుంచి పదిహేను రెట్లు ఎక్కువ ఆయుధ భాంఢాగారం వారి చేతికి రావటమే కాదు.. అత్యాధునిక ఆయుధాలు వారి చేతికి చిక్కాయి.
దీంతో.. వారి ద్వారా ఉగ్రవాదులకు మరింత తేలిగ్గా ఆయుదాలు అందే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. అలెర్టు అయిన భారత్ అత్యవసరంగా ఆయుధ కొనుగోళ్ల మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా రష్యా నుంచి 70 వేల ఏకే - 103 రైఫిళ్లను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.300 కోట్లుగా చెబుతున్నారు. రానున్న కొద్ది నెలల్లో ఆ ఆయుధాలన్ని భారత్ కు పంపనున్నారు.
కొత్తగా కొనుగోలు చేసిన ఆయుధాల్ని ఉగ్రవాదుల్ని ఏరి వేయటంలో ఉపయోగిస్తారు. ఈ రైఫిళ్లను జమ్ము కశ్మీర్.. శ్రీనగర్ లాంటి సున్నితమైన ప్రాంతాలు.. వాయు సేన స్థావరాల వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి వీటిని ప్రయారిటీలో భాగంగా ముందు ఇస్తారని చెబుతున్నారు. ఇక.. తాజాగా ఆర్డర్ పెట్టిన ఏకే - 103 రైఫిల్ సామర్థ్యాన్ని చూస్తే.. ఏకే - 47కు అప్ గ్రేడెడ్ వెర్షన్ గా చెప్పాలి. ఏకే 103 రైఫిల్ ను ప్రస్తుతం భారత నేవీ వినియోగిస్తోంది. కశ్మీర్ లోయలోని పూలర్ లేక్ వద్ద గస్తీ కాస్తున్న సిబ్బంది వద్దా ఉన్నాయి.
ప్రస్తుతం వినిపిస్తున్న అంచనాల ప్రకారం భారత వాయు సేనకు 1.5లక్షల రైఫిల్స్ అవసరం ఉంటే.. అందులో సగం కంటే తక్కువ (70వేలు) గానే రైఫిళ్ల కొనుగోలు జరిగినట్లు చెబుతున్నారు. చైనాతో సరిహద్దు వివాదం మొదలైన నాటి నుంచి భారత ప్రభుత్వం ఆయుధాల కొనుగోలు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పక తప్పదు.అయితే.. ఈ ఆధునీకీకరణ మరింత స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.