ఏపీ దేవాదాయ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇక నుంచి ఏడాదికి రూ. 50 కోట్లను చెల్లించనున్నది. ఇలా చెల్లించాలని ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఇప్పటివరకు టీటీడీ ఏటా రూ.2.25 కోట్లను మాత్రమే టీటీడీ చెల్లిస్తోంది. స్వామి వారి సొమ్మును వాడుకుటున్నారని ఇతర పార్టీలు, హిందూ సంఘాలు విమర్శలు చేస్తూండగా, ప్రభుత్వం మాత్రం ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకు రావని ఆలయాల కోసమే ఉపయోగిస్తారని చెప్తుంది. టీటీడీ చెల్లించనున్న ఈ రూ.50 కోట్ల మొత్తంలో సర్వశ్రేయో నిధికి రూ.40 కోట్లు చెల్లించనుండగా అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధికి రూ.5 కోట్లు, దేవాదాయ పరిపాలన నిధికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించనున్నారు.
ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఉపయోగించే కామన్ గుడ్ ఫండ్ , ఉద్యోగుల వేతనాలకు ఉద్దేశించిన ఎండోమెంట్ అడ్మినిస్ర్టేషన్ ఫండ్, అర్చక వెల్ఫేర్ ఫండ్ ల కోసం దేవదాయశాఖ తన పరిధిలోని ఆలయాల ఆదాయం నుంచి కొంత మొత్తం సేకరిస్తంది. 9 శాతం సీజీఎఫ్, 8 శాతం ఈఏఎఫ్, 3శాతం అర్చక వెల్ఫేర్ ఫండ్ కు తీసుకుంటుంది. అయితే టీటీడీనుంచి మాత్రం ప్రతి ఏటా స్థిరంగా తీసుకునేలా 1987లో నిర్ణయించారు.ఈ ప్రకారమే తీసుకుంటున్నారు. తర్వాత కొన్ని ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నించినప్పటికీ నిబంధనలు అడ్డం వచ్చాయి. అదే సమయంలో భక్తుల సెంటిమెంట్ కూడా దెబ్బతినే అవకాశం ఉండటంతో ఏ ప్రభుత్వమూ పెంచే ప్రయత్నం చేయలేదు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మాత్రం ఏటా రూ.50కోట్లు ఇచ్చేలా ఆర్డినెన్స్ తెచ్చింది.
పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ, ఆదాయం లేక ఆదరణకు నోచుకోని గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల కోసమే టీటీడీ నుంచిరూ. 50 కోట్లను దేవాదాయశాఖకు ఇచ్చేలా ఆర్డినెన్స్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిధులేవీ ప్రభుత్వ ఖజానాకు చేరవని అందుకే శ్రీవారి నిధులు ప్రభుత్వం తీసుకుంటుందనే విమర్శలకు అవకాశమే లేదని చెబుతోంది. సీజీఎఫ్, ఈఏఎఫ్, అర్చక వెల్ఫేర్ ఫండ్‌లకు శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఇంద్రకీలాద్రి, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలు ప్రతి ఏటా రూ. పది కోట్ల వరకూ దేవాదాయశాఖకు అందుతున్నాయి.
టీటీడీ నుంచి దేవాదాయ శాఖ తీసుకుంటున్న రూ. యాభై కోట్లలో కామన్ గుడ్ ఫండ్ -సీజీఎఫ్ కి రూ.40 కోట్లు కేటాయిస్తారు. ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ, ధూపదీప నైవేద్య స్కీంకార్యక్రమాలకు మిగతా మొత్తాన్ని వెచ్చిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మొదటి నుంచి వివాదాస్పదం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి ఆస్తులను అమ్మాలని ప్రయత్నించారు. వివాదం అవడంతో వెనక్కి తగ్గారు. పలు మార్లు భక్తులకు అందించే సేవల ధరల్ని పెంచారు. ఉచితంగా సేవలు అందించే వారిని పంపేసి ఖర్చు పెట్టి సేవల కాంట్రాక్టులు ఇవ్వడం దగ్గర్నుంచి నిన్నటి సంప్రదాయ భోజనం వరకూ అన్ని వివాదాలే. ప్రస్తుతం జారీ చేసిన ఆర్డినెన్స్ పై ప్రజలు , ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో.