ఒకవైపు పాత కరెన్సీ చెల్లుబాటు కాక - మరోవైపు కొత్త కరెన్సీ అందుబాటులో లేక,డిజిటల్ లావాదేవీలు పూర్తిగా చెలామణీలోకి రాకుండా సతమతమవుతున్న సామాన్యుడికి సర్వోన్నత న్యాయస్థానం పెద్ద ఉపశమనం కలిగించింది. రూ.వెయ్యి - రూ.500 నోట్ల రద్దు అనంతరం బ్యాంకు ఖాతాదారులు తమ అవసరాలకోసం వారానికి రూ.24వేలు తీసుకోవచ్చన్న నోటిఫికేషన్ కు కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది. నోటిఫికేషన్ ను సవరిస్తే తప్ప అప్పటివరకు ఆ ప్రకారం డబ్బులు తీసుకునే హక్కు ఖాతాదారులకు ఉంటుందని పేర్కొంది. భారీ సంఖ్యలో ప్రజలు కొద్ది మొత్తం కూడా దొరుకకుండా అవస్థలు పడుతుంటే, మరికొందరు మాత్రం కోట్ల కొద్దీ కొత్త నోట్లను ఎలా పొందుతున్నారని ప్రశ్నించింది. నోట్ల రద్దును సవాల్ చేసిన ఓ పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రతిస్పందించింది. వారానికి రూ.24వేలు తీసుకోవచ్చన్నతన ప్రకటన సవరిస్తే తప్ప సదరు నోటిఫికేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందే అని పేర్కొంది.
నోట్ల రద్దు అనంతరం ప్రజలు చేతుల్లో డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారని పిటిషనర్ తరపున హాజరైన సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం ఒక వ్యక్తి వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చు. ఎవరు కూడా ఈ హక్కును తోసిపుచ్చలేరు అని పేర్కొన్నారు. కరెన్సీ సమస్య ఉందని అటార్నీ జనరల్ అంటున్నారు. సరిపోయినంత నగదు లేదని చెప్తున్నారు. డబ్బు లేనప్పుడు ఇలాంటి హక్కును ఇవ్వాల్సింది కాదు అని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట సిబల్ తెలిపారు. నోట్ల రద్దు నోటిఫికేషన్ అనంతరం నవంబర్ 8 తర్వాత మూడురోజుల్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు) రూ.8000 కోట్లు సేకరించాయని, పాత నోట్లను మార్పిడి చేయడానికిగానీ, డిపాజిట్ చేయడానికిగానీ వాటిని అనుమతించలేదని సిబల్ చెప్పారు. దీంతో వాటి వ్యాపారం దెబ్బతింటున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ బదులిస్తూ.. వాటిని కేవైసీ నియమాల మేరకు ఆర్బీఐలో డిపాజిట్ చేసేందుకు అనుమతించామని, రెండు రోజుల్లోగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. ఇందుకు కోర్టు ప్రతిస్పందిస్తూ.. డీసీసీబీలు వాటి వ్యాపారాన్ని కొనసాగించాలనుకుంటున్నాయని పేర్కొంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే వాటి పట్ల వివక్ష ఎందుకు చూపుతున్నట్లని ప్రశ్నించింది. డీసీసీబీలు ఆర్బీఐ నియమాల ప్రకారం నడిచేవికావని, వాటిద్వారా లెక్కలుచూపని అక్రమధనం డిపాజిట్ అయ్యే ప్రమాదముందని రోహత్గీ చెప్పారు.
ఈ క్రమంలో న్యాయమూర్తులు స్పందిస్తూ.. సమస్య ఏమిటో తమకు అర్థం అయ్యిందని, కానీ ప్రస్తుత పరిస్థితిలో కొన్ని నియమాలను అనుసరించాల్సి ఉందని అన్నారు. "ప్రజలు భారీగా డిపాజిట్ చేస్తున్నారు. మీరు వారికి కరెన్సీ ఇవ్వాలి. మీరు చెల్లింపులను నిలిపేస్తున్నారు. ఎప్పటిలోగా ఈ సమస్యను పరిష్కరిస్తారు? ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము మీ కరెన్సీ కొరత సమస్యను అర్థం చేసుకోగలం. కానీ మీరు కొన్ని నియమాలను రూపొందించుకోవాల్సింది" అని ధర్మాసనం సూచించింది. పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో పాత నోట్లను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది. ప్రజలకు సరిపోయినంత నగదును సరఫరా చేయలేకపోయినప్పుడు పాత నోట్లను అనుమతించాలని పేర్కొంది. దాడుల్లో కొత్త కరెన్సీని ఏ స్థాయిలో పట్టుకున్నారని ప్రశ్నించింది. అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డ కొందరు బ్యాంకు అధికారులను అరెస్టు చేశామని, లెక్కలు చూపని డబ్బును స్వాధీనం చేసుకునేందుకు దాడులు కొనసాగిస్తున్నామని రోహత్గీ తెలిపారు. నోట్ల రద్దుకు సంబంధించి వివిధ హైకోర్టులు వివిధ అంశాలను చేపట్టాయని, వాటిని నిలువరించాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించి సముచితంగా ఆదేశిస్తామని కోర్టు చెప్పింది. వివిధ హైకోర్టుల్లో పెండింగులో ఉన్న అంశాలను సుప్రీంకోర్టుకుగానీ, ఏదైనా ఒక హైకోర్టుకుగానీ బదిలీ చేయాలని కేంద్రం విడిగా విజ్ఞప్తి చేసింది
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/