ఆర్ ఎస్ ఎస్.. ఈ పదం తెలియని వారు పెద్దగా ఉండరు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గా ఏర్పడి.. దేశ గతిని మారుస్తామని ప్రతిజ్ఞ చేసే ఈ స్వచ్ఛంద సేవా దళం.. దేశ గతిని అటుంచి.. దేశ మతిని మాత్రం మారుస్తోందనే అపప్రదను మాత్రం భారీగానే మూటగట్టుకుంది. 92 ఏళ్ల కిందట ఏర్పడిన ఆర్ ఎస్ ఎస్ లో మూలాలు ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధం కావు. లౌకిక దేశాన్ని కాషాయమయం చేయాలని తపించిపోయే ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవక్ లు.. ఎప్పుడు నోరు విప్పినా.. ఏదో ఒక సంచలనం. ఏదో ఒక వివాదం కామన్. ఆర్ ఎస్ ఎస్ భావజాలం అంటే.. దేశం నుంచి ఇతరులను వెళ్లగొట్టడమే అని చెప్పుకొచ్చారు కొందరు మేధావులు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సహా గతంలో ఈ దేశాన్ని పాలించిన బీజేపీ పెద్దలు సైతం ఈ భావజాల ముసుగును ధరించినవారే!
ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారాయి. వ్యక్తుల అభిరుచులు - అలవాట్లు కూడా మారాయి. అయినా.. ఆర్ ఎస్ ఎస్ మారలేదు! తన పాత చింతకాయ్ వాసనలు వదుల్చుకోవడం లేదు. ఫిబ్రవరి 14 వస్తే.. ప్రేమికుల కోసం పార్కులు చుట్టూ తిరిగే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలకు కొదవేలేదు. ఎక్కడ ప్రేమికులు కనిపిస్తే.. అక్కడ పెళ్లి! అంటూ ప్రకటనలు చేయడమూ కొత్తకాదు. నూతన సంవత్సరం జనవరి 1 అంటే అది మనకు కాదు! అనే పిడివాదం నుంచి కూడా వీరు ఇప్పటికీ బయటకు రాలేదు. తాజాగా ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవక్ ఓ మాట చెప్పి.. అందరినీ విస్మయానికి గురి చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు భారతదేశమే పరిష్కారం చూపగలదని ఉద్ఘాటించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భాగ్యనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయదశమి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా పదివేల మందికి పైగా స్వయంసేవకులు యూనిఫాం ధరించి పరేడ్ నిర్వహించారు. మ్యూజిక్ బ్యాండ్ కు అనుగుణంగా నగరవీధుల్లో కదం తొక్కారు. మూడు వరుసల్లో రెండుగా విడిపోయి అశోక్ నగర్ ప్రాంతంలో ఒకే చోట ఆరు వరుసల్లో కలిసి పరేడ్ కొనసాగించారు. కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న ఆరెస్సెస్ సహా సర్ కార్యవాహ్ డా. కృష్ణగోపాల్ మాట్లాడుతూ.. సర్వకోటి యందు దైవాన్ని దర్శించగలిగిన హిందూత్వమే ప్రపంచానికి మార్గం చూపగలదని చెప్పారు. హిందుత్వ భావన ఆధారంగా సామాజిక - సాంస్కృతిక - ఆర్థిక - రాజకీయ రంగాలలో ఈ దేశానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆరెస్సెస్ గత 92 ఏళ్లుగా కృషి చేస్తోందని చెప్పారు. మొత్తంగా ఈ దేశం ఓ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశమనే మాటను ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడు ఒప్పుకుంటుందో అని మేధావులు తలలు పట్టుకుంటున్నారు.