కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దేశంలో, రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఇలాంటి వేళ ప్రజలకు తమవంతు సహకారం అందించడం ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల కనీస బాధ్యత. అయితే.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బాధ్యతా రహితంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ప్రజలకు ధైర్యం చెప్పడానికి బదులు.. భయాందోళనకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆక్షేపిస్తున్నారు.
కరోనా ట్రీట్మెంట్లో నిన్నామొన్నటి వరకు.. రెమ్ డెసివర్ ఇంజక్షన్లు ఎలాంటిపాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే. ఆ ఇంజక్షన్ల కోసం ఎంతో మంది.. ఎన్నో అవస్థలు పడ్డారు. అలాంటి ఇంజక్షన్ల విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు అయ్యన్న.
కాలం చెల్లిన ఇంజక్షన్లు రోగులకు ఇస్తున్నారని, దీనికారణంగా ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీనిపై అధికార పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. అయ్యన్నే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. రెమ్ డెసివర్ ఇంజక్షన్లను తయారు చేసే కంపెనీ మైలాన్ లేబొరేటరీస్ సైతం.. ఈ ఇంజక్షన్లను మరో సంవత్సరం వరకు ఉపయోగించొచ్చని తెలిపిందని అన్నారు.
వేరే ఆరోగ్య సమస్యతో మరణించిన వారిని.. రెమ్ డెసివర్ ఇంజక్షన్ల వల్లనే చనిపోయారంటూ అయ్యన్న తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు కరోనాతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న వేళ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.