నందమూరి హరికృష్ణ... ఎన్టీరామారావుకు తనయుడు.. ఏపీ సీఎంకు బావమరిది.. తెలుగుదేశం సభ్యుడు. కానీ... కొద్ది రోజుల్లో ఆయన వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ఇదే వార్త. పురంధేశ్వరి కాంగ్రెస్ లో చేరినప్పుడే తట్టుకోలేకపోయిన టీడీపీ - ఎన్టీఆర్ అభిమానులు ఈ తాజా వార్తతో కలవరం చెందుతున్నారు. అయితే... ఇదంతా నిజం కాదని.. వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని తెలుస్తోంది. ఇంతకుముందు ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో టీఆరెస్ అనుసరించిన పద్ధతినే వైసీపీ ఫాలో అవుతూ ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేసి ప్రస్తుతం ఉన్న పార్టీలో అనుమానం కలిగేలా చేస్తోందని అంటున్నారు. ఇదంతా పుకార్లేనని హరికృష్ణ అభిమానులు మండిపడుతున్నారు.
ఈ వదంతులు రావడానికీ కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. రెండు మూడు కార్యక్రమాల్లో హరికృష్ణ - జగన్ కలిసినప్పుడు మాట్లాడుకున్నారు. దీంతో హరికృష్ణ వైసీపీలో చేరిపోతున్నారన్న ప్రచారం మొదలైపోయింది.
హరికృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ అంటే గిట్టని వారే ఈ ప్రచారం చేస్తున్నట్లుగా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. జగన్ తో హరికృష్ణ సన్నిహితంగా ఉన్నారన్న ప్రచారం విస్రృతంగా జరిగితే టీడీపీని అభిమానించే వారంతా జూనియర్ ఎన్టీఆర్ ను ధ్వేషిస్తారు, అప్పుడు భవిష్యత్తులో టీడీపీ నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాన్ని ఎన్టీఆర్ కోల్పోతారన్న ఉద్దేశంతోనే కొందరు హరి వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారని హరికృష్ణ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. దీనికి వైసీపీ కూడా తోడవుతోందని ఆరోపిస్తున్నారు.