జ‌గ‌న్ కు హోదా క్రెడిట్ రాకుండా ఉండేందుకు కుట్ర‌!

Update: 2019-06-15 11:48 GMT
రెండంటే రెండు వారాల వ్య‌వ‌ధిలోనే త‌న పాల‌న ఎలా ఉంటుంద‌న్న దానిపై ఒక క్లారిటీ ఇచ్చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. విప‌క్ష నేత‌గా ఉన్న నాటి నుంచి హోదా మీద ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు తెలిసిందే. తాజాగా ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో తాను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌రా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా గురించే మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆశ్చ‌ర్య‌క‌రంగా జ‌గ‌న్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా.. జ‌గ‌న్ కు రావాల్సినంత పేరు ప్ర‌ఖ్యాతులు రాకుండా ఉండేలా కొంద‌రు మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

నీతిఆయోగ్ స‌మావేశంలో పాల్గొన‌టానికి ఢిల్లీ వెళ్లిన ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను.. ప్ర‌ధాని మోడీతోనూ భేటీ అయ్యారు. ప్ర‌తి సంద‌ర్భంలోనూప్ర‌త్యేక హోదా అంశాన్ని జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ‌య‌ట మ‌రోలా ప్ర‌చారం సాగ‌టం విశేషం.

బీజేపీతో దోస్తీ క‌ట్టేందుకు జ‌గన్ భేటీ అయ్యార‌న్న వార్త‌లు మీడియాలో అంత‌కంత‌కూ ఎక్కువ అయ్యాయి. వాస్త‌వానికి అలాంటిదేమీ లేన‌ప్ప‌టికీ.. బీజేపీతో దోస్తానాకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న ప్ర‌చారంతో పాటు.. మ‌రో వ‌దంతిని వైర‌ల్ చేయ‌టం షురూ చేశారు. అదేమంటే.. లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇచ్చేందుకు బీజేపీ సిద్ధ‌మైంద‌ని.. ఆ విష‌య‌మై జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లుగా ప్ర‌చారం సాగింది.

అయితే.. ఇదంతా విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు.. హోదాపై జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని త‌క్కువ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌టంగా చెప్పాలి. ఢిల్లీలో తాను హోదా గురించి మాట్లాడితే.. మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ అందుకు భిన్న‌మైన ప్ర‌చారం సాగుతుండ‌టాన్ని గ‌మ‌నించిన జ‌గ‌న్ వ‌ర్గం వెంట‌నే అలెర్ట్ అయ్యింది. దీంతో.. జ‌గన్ స్వ‌యంగా మీడియాతో మాట్లాడుతూ పుకార్ల‌కు చెక్ పెట్టేలా క్లారిటీ ఇచ్చారు.

తాను బీజేపీతో దోస్తీ క‌డ‌తామ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని తేల్చి చెప్పారు. లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌చూపిన‌ట్లుగా వ‌స్తున్న ప్ర‌చారంలోనూ నిజం లేద‌ని తేల్చ ఇచెప్పాలి. త‌న ప‌ర్య‌ట‌న‌లో హోదా త‌ప్పించి మ‌రే ఇత‌ర అంశాన్ని తాను ప్ర‌స్తావించ‌లేద‌న్న మాట‌ను చెప్పారు. త‌న ప‌ర్య‌ట‌న మొత్తం హోదా చుట్టూనే తిరిగింద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన జ‌గ‌న్ మాట‌లు చూస్తే.. ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని త‌క్కువ‌చేసేలా పెద్ద ఎత్తున కుట్ర జ‌రుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News