పిల్లల్లో ఆ లక్షణం కరోనా లక్షణం కాదట ... డోంట్ వర్రీ !

Update: 2020-09-19 23:30 GMT
కరోనా వైరస్ .. కరోనా వైరస్ .. ఈ పేరు చెప్తేనే చాలామంది వణికిపోతున్నారు. దీనికి కారణం కరోనా కి వ్యాక్సిన్ లేకపోవడమే. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా వ్యాక్సిన్ మాత్రం తయారు కావడం లేదు. దీనితో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఈ కరోనా మహమ్మారి కి నిర్దిస్టమైన ఓ లక్షణం అంటూ లేకపోవడంతో ఒకరి నుండి మరొకరికి వేగంగా పాకుతుంది. కొంతమందికి తమకి కరోనా సోకిన విషయం కూడా తెలియడం లేదు.

ఇక , కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ క్రమంలో దగ్గు, జలుబు వచ్చినా కొంతమంది కొరోనా లక్షణమే అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు కీలక విషయం చెప్తున్నారు. చిన్నపిల్లల్లో ముక్కు విప‌రీతంగా కారడాన్ని క‌రోనా వైర‌స్ లక్షణంగా భావించవద్దని సూచించారు. కరోనాతో వచ్చే జ‌లుబుకు ముక్కు కార‌దని, కానీ ముక్కు దిబ్బడేసిన‌ట్లుగా ఉంటుంద‌ని వారు తెలిపారు. సాధారణ జ‌లుబు చేస్తే ముక్కు కారడం ఓ మామూలు లక్షణమని, దాన్ని కరోనా లక్షణంగా భావించకండని అన్నారు. అలాగే పిల్లల్లో ముక్కు కారడం ఉంటే, కచ్చితంగా కరోనా వైరస్ లేనట్లేనని లండన్ ‌లోని కింగ్స్‌ కాలేజీ ప్రొఫెస‌ర్ టిమ్ స్పెక్టర్ తెలిపారు.

ఇక కరోనా మహమ్మారి లక్షణాలపై తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని చెప్తున్నారు. ముక్కు కారడంతో పాటు ఇతర లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి వలన వైద్య పరీక్షలు చేయడం సవాల్‌గా మారిందని.. ఇలాంటి పరిస్థితుల్లో జలుబు ఏదో, కరోనా లక్షణం ఏదో గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని టిమ్ చెప్పారు.
Tags:    

Similar News