చేయకూడని పనిని రష్యా చేసింది. అంతరిక్షంలో ఆ దేశం చేసిన పని కారణంగా ప్రపంచ దేశాల మీదా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. తాజాగా యాంటీ శాటిలైట్ క్షిపణనిని పరీక్షించింది. ఇందులో భాగంగా తనకు చెందిన ఒక శాటిలైట్ ను పేల్చేసింది. దీంతో.. ధ్వంసమైన శాటిలైట్ శకలాలు.. అంతరిక్షంలోని ఇతర శాటిలైట్లకు.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని సిబ్బందికి ప్రమాదకరంగా మారింది. దీంతో.. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఈ కేంద్రంలోని సిబ్బంది కాప్స్యూల్స్ లోకి వెళ్లి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్ష ప్రమాదకరమైనదని.. నిర్లక్ష్యంతో కూడుకున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. రష్యా మాత్రం అలాంటిదేమీ పట్టించుకోకుండా ఉండటం గమనార్హం. ఈ తీరును అమెరికా తాజాగా ఖండించింది.
అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో పని చేస్తున్న ఏడుగురు సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా రష్యా చేసిందని చెప్పింది. ఈ కేంద్రంలో ఉన్న ఏడుగురు సిబ్బందిలో నలుగురు అమెరికన్లు కాగా.. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు రష్యన్లు.. ఒకరు జర్మనీకి చెందిన వారు కావటం గమనార్హం. రష్యా చేపట్టిన పరీక్ష.. తమ సొంత శాస్త్రవేత్తల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టినట్లుగా మండిపాటు వ్యక్తమవుతోంది.
భూమికి 420 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఈ అంతరిక్ష కేంద్రానికి రష్యా పేల్చేసిన శాటిలైట్ శకలాల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని భావిస్తున్నారు. రష్యా చేపట్టిన పరీక్ష కారణంగా ఆచూకీ తెలుసుకునే వీలున్న 1500 ముక్కల శకలాల్ని.. వేలాది చిన్నపాటి శకలాల్నిక్రియేట్ చేసిందని.. అంతరిక్ష కక్ష్యలో తిరుగుతున్న అన్ని దేశాలకు చెందిన శాటిలైట్ల ప్రయోజనాల్ని దెబ్బ తీసే అవకాశం ఉందంటున్నారు.
అయితే.. ఈ విమర్శల్ని రష్యా అంతరిక్ష సంస్థ రాస్కోస్మోస్ సింఫుల్ గా కొట్టి పారేసింది. ప్రమాణాల్ని పాటించి మరీ తామీ ప్రయోగాన్ని నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. తాము చేపట్టిన ప్రయోగం.. అంతరిక్ష పరిశోధన సంస్థకు చాలా దూరంలో నిర్వహించినట్లుగా స్పష్టం చేసింది. రష్యా చర్యను ప్రపంచంలోని పలు దేశాలు ఖండిస్తున్నాయి. ఈ పరీక్ష కారణంగా విడుదలైన వ్యర్థాలు కక్ష్యలో కొనసాగుతూ.. రానున్న రోజుల్లో శాటిలైట్లకు.. మానవ అంతరిక్ష ప్రయాణాలకు ప్రమాదంగా మారే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై.. ఈ రంగానికి చెందిన నిపుణుల అభిప్రాయాల్ని సేకరిస్తే.. భయం కలిగించే అంశాల్ని వారు ప్రస్తావిస్తారు. అంతరిక్ష వ్యర్థాలు వేగంగా పెరుగుతున్న సమస్యగా చెబుతున్నారు. మన పైనున్న ఆకాశంలో 64 ఏళ్లుగా సాగిస్తున్న అంతరిక్ష కార్యకలాపాల కారణంగా ఒక సెంటీమీటర్ మొదలు 10 సెంటీమీటర్ల వరకు పరిణామం కలిగిన దాదాపు పది లక్షల వస్తువులు అంతరిక్షంలో భూమి చుట్టూ ఎలాంటి కంట్రోల్ లేకుండా తిరుగుతున్నట్లు వాపోతున్నారు.
వీటిల్లో ఏ ఒక్కటైనా వాతావరణ ఉపగ్రహాన్ని కానీ.. సమాచార శాటిలైట్ ను కానీ తాకితే.. దానికి జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా.. రష్యా చేసిన పనిని పలువురు తప్పు పడుతుంటే.. ఆ దేశం మాత్రం తన చర్యను సమర్ధించుకుంటోంది. ఇదిలా ఉంటే.. తమకు ముందు మరికొన్ని దేశాలు ఇలా పని చేయని శాటిలైట్లను పేల్చేసినట్లుగా గుర్తు చేస్తున్నారు. ఒకరు చేసిన ఎదవ పనిని మళ్లీ చేయటమే కాదు.. సర్దుబాటు టోన్ లో చెబుతున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.