రష్యా వ్యాక్సిన్ పై బాంబు పేల్చిన డబ్ల్యూ.హెచ్.వో

Update: 2020-08-14 05:45 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందు లేక.. వ్యాక్సిన్ రాక అష్టకష్టాలు పడుతున్న వేళ ఏకంగా వ్యాక్సిన్ నే రిలీజ్ చేసింది రష్యా దేశం. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బాగా పనిచేస్తుందని పేర్కొంది. రష్యా అధ్యక్షుడు స్వయంగా తన కూతురుకే ఇప్పించి సంచలనం సృష్టించాడు.

అయితే రష్యా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) స్పందించింది. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్’ అడ్వాన్స్ స్టేజ్ లో లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనావ్యాక్సిన్ తయారీలో తొమ్మిది వ్యాక్సిన్లు మాత్రమే ప్రయోగదశలో ముందున్నాయని తెలిపింది.

రష్యా వ్యాక్సిన్ పై తగినంత సమాచారం లేదు కాబట్టి దాని సమర్థత పై నిర్ణయానికి రాలేమని డబ్ల్యూ.హెచ్.వో సీనియర్ సలహాదారు తెలిపారు.

టీకా ఏ దశలో ఉందో అర్థం చేసుకోవడానికి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని డబ్ల్యూ.హెచ్.వో తెలిపింది.


Tags:    

Similar News