రష్యా దృష్టిలో శత్రువు శత్రువు మిత్రుడనుకోవాలో ఏమో కానీ భారత్ దృష్టిలో మాత్రం శత్రువు మిత్రుడు శత్రువే! ప్రస్తుతం ఈ సూత్రం భారత్ రష్యాలకు సరిగ్గా సరిపోయేలా కనిపిస్తుంది. తాజా పరిణామాలు కూడా అందుకు సరేనంటున్నాయి. ఇంతకూ మొన్నటివరకూ బాగానే ఉన్న రష్యా - భారత్ బంధాలకు తాజాగా ఏమైంది? ఏ విషయం ప్రస్తుతం భారత్ - రాష్యాల మధ్య సమస్యలు తలెత్తడానికి కారణం అయ్యింది? ప్రత్యేకంగా చెప్పేదేముంది... సీపీఈసీ!
చైనా - పాకిస్థాన్ దేశాల మధ్య ఏర్పాటు కాబోతున్న "చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ - చైనా లమధ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో తాజాగా ఇదే విషయమై భారత్ - రష్యాల మధ్య కూడా సమస్యలు తలెత్తేలా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం భారత్ కు బద్ధశత్రువులైన పాకిస్థాన్ - చైనాలకు రష్యా అండగా నిలవడమే. అయితే చైనా - పాక్ ల మధ్య కారిడార్ కు రష్యా మద్దతిస్తే భారత్ కు ఏమిటి సమస్య అనుకోవచ్చు. ఇంతకూ సీపీఈసీ అనేది పాక్ లోని గ్వాదర్ నుంచి బలోచిస్తాన్ ప్రావిన్స్ గుండా చైనాలోని జిన్ జియాంగ్ వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు కారిడార్ గిల్ గిత్ - బాల్టిస్తాన్ నుంచి వెళ్లనుంది. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఎందుకంటే ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని భూభాగం. దీంతో ఈ భూభాగం తమదేనని భారత్ ఇప్పటికీ చెబుతూనే ఉంది. ఇదే విషయంపై ఇప్పటికే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమైన భారత్ ప్రధాని నరేంద్రమోడీ... వివాదంలో ఉన్న భూభాగం విషయంలో పాక్ తో కలిసి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టును ఆపేస్తామని చైనా ఎలాంటి ప్రకటనా చేయలేదు సరికదా, తాజాగా రష్యా తెరమీదకు వచ్చింది.
ఈ క్రమంలో చైనా - పాక్ ల మధ్య ఏర్పాటు కాబోతున్న సీపీఈసీకి తాము మద్దతిస్తున్నామని, పాక్ ఆర్థిక వ్యవస్థకు ఆ ప్రాజెక్టు చాలా అవసరం అని రష్యా పేర్కొంది!అంతే కాకుండా సీపీఈసీకు తమ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ప్రాజెక్టుతో సంబంధం కలుపుదామనుకుంటున్నామని ప్రకటించింది. దీంతో ఈ విషయంపై భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ స్పందిస్తూ... ఇలాంటి ప్రకటనలతో భారత్ - రష్యాల బంధం బలహీనమవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచదేశాల మధ్య పాక్ ను ఒంటరి చేయాలన్న భారత్ ఆశ నెరవేరలేదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/