ఈయూలో ఉక్రెయిన్ కు సభ్యత్వం..: రష్యాకు షాక్

Update: 2022-06-24 07:30 GMT
ప్రపంచ చరిత్రలోనే సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించిన దేశాల్లో రష్యా, ఉక్రెయిన్లు నిలుస్తాయి. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే నేపథ్యంలో రష్యా భీకర యుద్ధం చేస్తోంది. భారీగా మిలటరీ బలగానే ఉక్రెయిన్ వైపు పంపి ఆ దేశాన్ని ఛిన్నాభిన్నం చేసింది.   రష్యా దాడికి ఉక్రెయిన్ భయపడకుండా ఎదురొడ్డి నిలబడుతోంది.  తమ దేశం ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినా చివరి వరకు పోరాడడానికి బరిలో నిల్చుంది.

అయితే ఉక్రెయిన్ ఇంతలా ధైర్యంగా ఉండడానికి యూరోపియన్ దేశాలే అని తెలుస్తోంది. ఉక్రెయిన్ కు నాటోల సభ్యత్వం లేకున్నా.. ఆ స్థాయిలోనే ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. దీంతో రష్యా ఆగడాలకు ఉక్రెయిన్ అడ్డుకట్ట వేసేందుకు అవకాశం వస్తోంది.

తాజాగా ఉక్రెయిన్ కు మరింత అండగా ఉండేందుకు యూరోపియన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వ హోదా కల్పించాలని అనుకున్నాయి. బ్రస్సెల్స్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా కీవ్ దరఖాస్తును ఆమోదించాయి. మరో దేశం మాల్డోవకి కూడా ఇటీవలే సభ్యత్వాన్ని ఇచ్చాయి. దీంతో రష్యా దూకుడును అడ్డుకునేందుకు ఈయూ దేశాలు ముందుుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈయూలో ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వడంతో రష్యాకు మరింత ఆగ్రహం తెప్పించినట్లయింది. ఈ సభ్యత్వం పూర్తయ్యే వరకు ఒక దశాబ్దం పడుతుందని వ్యంగాస్త్రాలను వేస్తోంది.

కానీ యూరపియన్ కమిషన్ ప్రెసిడెంట్ మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. ఉక్రెయిన్ దేశం ఈయూలో చేరేందుకు అవసరమైన సంస్కరణలను వెంటనే పూర్తి చేస్తామని అంటున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిన్ జెలెన్ స్కీ సైతం యుద్దం చివరి దశకు చేరుకుంటున్న వేళ ఉక్రెయిన్ కు ఊపిరి పోసేలా ఈయూ దేశాలు గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాయని అన్నారు. ఉక్రెయిన్ భవిష్యత్ మొత్తం ఈయూతో ముడిపడి ఉందన్నారు.

రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఇక తాడోపేడో అనుకుంటూ  ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈయూ దేశాలు రష్యాకు గట్టి షాకే ఇచ్చారు. ఇంతకాలం రష్యా చేసే యుద్ధంతో ఉక్రెయిన్ భయపడి తన గుప్పిట్లోకి వస్తుందని అనుకుంటున్నా.. ఉక్రెయిన్ మాత్రం యూరోపియన్ సపోర్టుతో తెగించి పోరాడుతోంది. అయితే తాజాగాయూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు సభ్యత్వం ఇస్తాననడం రష్యాను మరింత రెచ్చగొట్టినట్లయింది. ఈ నేపథ్యంలో రష్యా ఏ విధంగా ముందుకు వెళ్తుందోనని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఇక యుద్దంలో ముందకు వెళ్లేందుకు అమెరికా లాంటి దేశాలు ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. అయినా కూడా రష్యా ఏమాత్రం జడవకుండా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. తూర్పు ఉక్రెయిన్ ను దాదాపు ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా తాజాగా డాన్బాస్ ప్రాంతంలో రెండు పారిశ్రామికన నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ పై ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తోంది. కానీ ఈయూ దేశాలు మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా పరోక్షంగా పోరాడుతున్నాయి.
Tags:    

Similar News