రష్యా-ఉక్రెయిన్ దేశాల నడుమ భీకర యుద్ధం జరుగుతోంది. ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బాంబుల మోత మోగుతోంది. అయితే ఈ త్వరలో తీవ్రరూపం దాల్చనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి అణ్వాయుధాల దాకా వచ్చేలాగా ఉందని వివిధ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
అలా అయితే ప్రపంచమంతా సర్వ నాశనం అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటికి కారణం రష్యా అణ్వాయుధాలు. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశాల్లో రష్యా టాప్ ఉంటుందని అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ కు మద్దతుగా వచ్చే దేశాలు విపరీత పరిస్థితులను ఎదుర్కొంటాయని పుతిన్ ఇదివరకే హెచ్చరించారు. గతంలో ఎన్నడూ చూడని ఫలితాలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కొన్ని దేశాలు యుద్ధం పట్ల స్పందించకుండా ఉంటున్నాయి.
ఇదిలా ఉండగా ఆ దేశ అణ్వాయుధ దళాలు అప్రమత్తం కావాలని ఆదేశించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ యుద్ధ అణ్వాయుధాల దాకా వస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అత్యధికంగా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల్లో రష్యా టాప్ అని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రపంచంలో అత్యధికంగా 6,225 న్యూక్లియర్ వార్ హెడ్స్ రష్యా వద్ద ఉన్నాయని అణ్వాయుధాల నిషేధానికి కృషి చేస్తున్న ఓ సంస్థ వెల్లడించింది. అవి అమెరికా వద్ద 5,550, చైనా-350, ఫ్రాన్స్-250 కలిగి ఉంటాయని పేర్కొంది. ఆయుధాల నిర్వహణ కోసం రష్యా 2020లో 8 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని తెలిపింది.
ఈ ఆయుధాలను రష్యా అధ్యక్షుడి అనుమతితో ఉపయోగించవచ్చని. అందుకు రక్షణశాఖ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాప్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ అనుమతి కూడా అవసరమని రష్యా రాజ్యాంగంలో ఉందని ప్రస్తావించింది.
ఉక్రెయిన్ పై రష్యా తెగబడుతోంది. రోజురోజుకూ సమస్య తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రష్యా సైనిక వర్గాలకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అప్రమత్తం చేయడం ఇప్పడు ఆందోళనకు గురి చేస్తోంది. యుద్ధంలో పాల్గొనేందుకు వ్యూహాత్మక దళాలు అలెర్ట్ గా ఉండాలని పుతిన్ ఆదివారం ఆదేశించారు.
ఎక్కువ సంఖ్యలో అణ్వాయుధ క్షిపణి దళాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పుతిన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.