రష్యా-ఉక్రెయిన్ వార్.. మృతుల సంఖ్య అధికారికంగా వెల్లడి..!

Update: 2022-12-02 16:30 GMT
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత పదినెలలుగా వార్ నిరాటకంగా కొనసాగుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై ముప్పేట దండయాత్రకు దిగాడు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ సైతం రష్యాకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ వార్ హోరాహోరీగా సాగుతోంది.

అయితే ఇరుదేశాల అధ్యక్షులు ఎవరీకీ వారు తగ్గకపోవడంతో లక్షలాది మంది సైనికులు.. ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇరు దేశాలు తమ సైనికుల మరణాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారుడు మైఖైలో పొడొల్యాక్ తమ దేశ సైనికుల మరణాలను అధికారికంగా వెల్లడించారు.

రష్యా దాడిలో ఉక్రెయిన్ సైనికులు 10వేల నుంచి 13వేల వరకు మృతి చెంది ఉంటారని తెలిపారు. యుద్ధం మొదలైన పది నెలల తర్వాత ఉక్రెయిన్ తమ దేశ సైనికుల మరణాలపై స్పందించింది. అయితే పౌరుల అధికంగా ఉండొచ్చని తెలిపారు. అలాగే రష్యా సైనికులు లక్ష మంది వరకు మృతి చెందారని.. మరో లక్షన్నర మంది గాయపడి ఉంటారని పొడొల్యాక్ తెలిపారు.

అయితే గత నెలలో అమెరికా సైనిక జనరల్ మార్క్ మిల్లీ ఇందుకు భిన్నమైన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు యుద్ధంలో లక్ష మంది వరకు సైనికులు మృతి చెందగా.. ఉక్రెయిన్ వైపు కూడా అంతే స్థాయిలో చనిపోవడమే.. గాయపడటమో జరిగిందని తెలిపారు. అలాగే ఐరోపా కమిషన్ అధిపతి ఉర్సలా వొన్ డెర్ లెయోన్ రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ లక్షమంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలను కోల్పోగా.. 20 వేల మంది పౌరులు మృత్యువాత పడ్డారని తెలిపారు.

ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ దేశాలకు చెందిన సైనికులు లక్షల్లోనే ప్రాణాలను కోల్పోయినట్లు ప్రచారం జరుగుతుందని అందరనీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే బ్రిటన్ కు చెందిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్ బేర్ గిల్స్ ఉక్రెయిన్ వెళ్లి ఆ దేశ అధ్యక్షుడితో భేటి అయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎముకలు కొరికే చలికి తోడు మౌలిక వసతులపై జరుగుతున్న దాడులతో లక్షల మంది ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారని.. ప్రస్తుతం ప్రపంచం ఎన్నడూ చూడని జెలెన్ స్కీని చూస్తుందని’’ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News