ఉక్రెయిన్ లో యుద్ధం ఇప్పట్లో ఆగదు.. !

Update: 2022-06-19 23:30 GMT
ఉక్రెయిన్ లో సుదీర్ఘ యుద్ధం తప్పక పోవచ్చని నాటో చీఫ్ జేన్స్ స్టాలెన్ బర్గ్ స్పష్టం చేశారు. కొన్నేళ్లపాటు జరగనున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలు సన్నద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ యుద్ధంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

ఉక్రెయిన్ లో యుద్ధం ఇప్పట్లో ముగియకపోవచ్చని నాట చీఫ్ జేన్స్ స్టాలెన్ బర్గ్ అన్నారు. ఈ యుద్ధంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని.. కొన్నేళ్లపాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశముందని తెలిపారు. ఉక్రెయిన్ కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలు సన్నద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

మాస్కో తన సైనిక లక్ష్యాలు సాధిస్తే అంతకు మించిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు. సైనిక సాయం కారణంగా యుద్ధం ఖరీదు కాదని.. పెరుగుతున్న ఇంధన, ఆహార ధరలు కారణంగా యుద్ధంలో చెల్లించాల్సిన మూల్యం పెరిగిపోతోందని తెలిపారు. సమష్టిగా సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఇటీవల బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరించిన సమయంలోనే స్టాలెన్‌బర్గ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలు ఇస్తే.. తూర్పు డాన్ బాస్ లోని ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేయవచ్చని జేన్స్ స్టాలెన్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఉక్రెయిన్ అధికారులు భారీ ఆయుధాల కోసం పశ్చిమ దేశాలను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సి రెస్నికోవ్ దాదాపు యాభై దేశాలకు చెందిన ప్రతినిధులను బ్రస్సెల్స్ లో కలిసి ఆయుధాలు కోరారు. ఇప్పటి వరకు పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఆయుధాలు ఉక్రెయిన్ ఆత్మరక్షణకు సరిపోలేదని వివరించారు.

మరోవైపు మోరియపోల్ ను కాపాడేందుకు పోరాడిన ఇద్దరు ఉక్రెయిన్ టాప్ కమాండర్లు రష్యా చేతికి పట్టుబడ్డారు. వారిని రష్యాకు తరలించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

ఇక బాల్టిక్‌ ప్రాంతంలో అత్యంత కీలకమైన కలినిన్‌గ్రాడ్‌కు రష్యా నుంచి సరుకుల రవాణా చేసే మార్గాన్ని వాడుకొనేందుకు అనుమతులను లిథువేనియా రద్దు చేసింది. ఇది అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని కలినిన్‌గ్రాడ్‌ గవర్నర్‌ ఆరోపించారు. దీంతో సెయింట్ పీటర్స్‌ బర్గ్‌ నుంచి జలమార్గాల్లో సరుకుల రవాణా జరుగుతోందన్నారు.
Tags:    

Similar News