ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణతో ఫిన్లాండ్, స్వీడన్ బెంబేలెత్తిపోతున్నాయి. రష్యా తదుపరి లక్ష్యం తామే అవుతామని భయపడుతున్నాయి. అసలే శాంతికాముక, మెరుగైన జీవన ప్రమాణాలున్న దేశాలు కావడంతో.. యుద్ధం అనే ఊహనే స్వీడన్, ఫిన్లాండ్ భరించలేకపోతున్నాయి. రష్యాతో 1,300 కిలోమీటర్లపైగా సరిహద్దును పంచుకుంటున్న ఫిన్లాండ్ అయితే.. నాటో కూటమిలో తక్షణమే చేరిపోయేందుకు సిద్ధమవుతోంది. ఈ దిశగా వేగంగా అడుగులేస్తోంది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధంకావాలని ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్ భద్రత మరింత బలపడుతుందని వెల్లడించారు. ఫిన్లాండ్ చేరికతో నాటో కూటమి కూడా బలోపేతం అవుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫిన్లాండ్ పార్లమెంట్, సీనియర్ రాజకీయ నాయకులు పరిశీలించిన తర్వాత ఆదివారం నాటో అంశంపై ఓ ప్రకటన చేయనుంది. అదే రోజు స్వీడన్ కూడా నాటోలో చేరికపై ఓ నిర్ణయం వెలువరించనుంది. మరోపక్క రష్యా దీనిపై మండిపడుతోంది. ఎటువంటి సైనిక కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉండటంపై కొన్ని దశాబ్దాలుగా ఉన్న పాలసీని వీడితే తీవ్ర పరిణమాలు తప్పవని స్వీడన్, ఫిన్లాండ్‌లను ఇప్పటికే రష్యా హెచ్చరించింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్‌లో నాటోలో చేరికపై ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఫిన్లాండ్ 1,300 కిలోమీటర్ల సరిహద్దులను రష్యాతో పంచుకొంటోంది. ఇప్పటి వరకు రష్యాతో విరోధం వద్దునుకొని నాటోలో చేరలేదు. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టాలెన్ బర్గ్ మాట్లాడుతూ వీలైనంత త్వరంగా స్వీడన్, ఫిన్లాండ్ సభ్యత్వం ప్రాసెసింగ్ పూర్తవుతుందన్నారు. ఇప్పటికే ఫిన్లాండ్‌లో నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 76శాతం మంది నాటోలో చేరేందుకు మొగ్గు చూపారు. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తరువాత ఫిన్లాండ్ ప్రజల అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. అంతకుముందు నాటోలో చేరికకు 20-30 శాతం మంది మాత్రమే ఫిన్లాండ్ వాసులు మొగ్గు చూపేవారు.
నాటోలో చేరితే ఏమవుతుంది?
నాటో.. అంటే నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్. 30 దేశాల ఈ కూటమికి అమెరికా పెద్దన్న. బ్రిటన్ ది సైతం కీలక పాత్ర. ప్రస్తుతం 30 సభ్య దేశాలున్నాయి. ఫిన్లాండ్, స్వీడన్ చేరికతో సంఖ్య పెరుగుతుంది. అయితే, స్వీడన్ కు రష్యాతో నేరుగా సరిహద్దులు లేవు. అయితే, ఫిన్లాండ్ తో ఉంది. ఇక సభ్య దేశంపై ఏ ఇతర దేశమైనా దాడి చేస్తే.. నాటో కూటమి ఉమ్మడిగా స్పందిస్తుంది. అవతలి దేశంపై యుద్ధానికి సిద్ధమవుతాయి.
అందుకనే నాటో అంటే అంత పవర్ ఫుల్. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంలో నాటో ఉక్రెయిన్ కు పూర్తి మద్దతుగా నిలుస్తోంది. అసలు ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు ప్రధాన కారణమే ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకోవడం. ఇది తమకు చాలా ప్రమాదకరమని రష్యా భావిస్తూ, దాడికి దిగింది. అయితే, అమెరికా, నాటో దళాల మద్దతుతో ఉక్రెయిన్ దాదాపు మూడు నెలలుగా పోరాడుతోంది. అందుకనే రష్యా యుద్ధంలో విజయం సాధించలేకపోతోంది.
రష్యాకు పెరగనున్న నాటో సరిహద్దు.. బాల్టిక్ సీలో కీలకం
ఫిన్లాండ్ చేరితే నాటో దేశాలతో రష్యాకు ఉన్న సరిహద్దు రెట్టింపు (2700 కిలోమీటర్లు) అవుతుంది. అంతేకాదు.. రష్యాలోని ప్రముఖ నగరాలైన సెయింట్ పీటర్స్ బర్స్, కలినన్ గ్రాడ్ లు నాటో దేశాల గురిలోకి వెళ్తాయి. అంతేకాక.. బాల్టిక్ సముద్రంలో నాటో దేశాలదే పైచేయి అవుతుంది.
ఫిన్లాండ్ కు రష్యా గ్యాస్ కట్
ఫిన్లాండ్ నాటో చేరిక యత్నాలపై మండిపడుతున్న రష్యా.. ఆ దేశానికి శుక్రవారం గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. అయితే, ఇప్పటికే ఫిన్లాండ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. తమపై ఆంక్షల నేపథ్యంలో గ్యాస్ చెల్లింపులను రూబుల్స్ లోనే చేయాలని రష్యా కోరుతోంది. దీన్ని గమనించిన ఫిన్లాండ్.. ఈ నెల 5 నుంచే రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.