అమెరికాకు రష్యా వార్నింగ్... అదే జరిగితే భారత్ కు ఇబ్బందే!

Update: 2022-02-26 09:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించి నేటి మూడో రోజు. అయితే  గడిచిన రెండు రోజులుగా ఉక్రెయిన్ లోని చాలా మంది గాయపడ్డారు. మరి కొందరు చనిపోయారు. వద్దు వద్దు అని  ప్రపంచ దేశాలు చెప్తున్నా కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే వేర్పాటు వాదులు ఉన్న ప్రాంతాలను రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. రాజధాని కీవ్ ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా  రష్యా  సేనలు ముందడుగు వేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో తమ మాట వినకపోవడం కారణం అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు రష్యాకు షాకిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆ దేశ  బ్యాంకులు, వ్యక్తులు, వ్యాపారాలపై ఆంక్షలు విధించడం. అయినా కానీ రష్యా మాట వినకుండా మరింత ముందుకు సాగింది. ఉక్రెయిన్ లోని చాలా  ప్రాంతాల పై దాడులు ముమ్మరం చేసింది.

అయితే అమెరికా.. ఇటీవల రష్యా పై విధించిన ఆంక్షలను తీవ్రంగా ఖండించారు రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్. దీని వల్ల రష్యా కాకుండా మిగతా అన్ని దేశాలు నష్టపోతాయని అన్నారు.   అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో దేశాల మధ్య సహకారం కూడా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఐఎస్ఎస్ నిర్విరామంగా కొనసాగాలంటే కచ్చితంగా అన్ని దేశాల సహకారం అవసరం అని తెలిపిన ఆయన... ఆంక్షల వల్ల స్పేస్ లో కూడా సహాయ సహకారాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదు అన్నారు.

ఇలాంటి నేపథ్యంలో మరో కీలక వాదనను  తెర మీదకు తీసుకుని వచ్చారు రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్. ప్రస్తుతం ఉన్న ఐఎస్ఎస్ నియంత్రణ  తప్పితే కొన్ని దేశాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అంతరిక్ష స్పేస్ స్టేషన్ తిరిగి కక్షకు అనుకూలంగా కొన్ని దేశాలు ఉన్నాయని తెలిపారు. అది కానీ అదుపు తప్పితే అమెరికా, ఇండియా, ఐరోపా లాంటి దేశాల మీద పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే అది రష్యా మీద పడే అవకాశం లేదని మరో మారు స్పష్టం చేశారు రోస్ కాస్మోస్ చీఫ్. ఈ మేరకు సంబంధించిన విషయాలు ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్ పై దాడిలో తమను అడ్డుకోవద్దని రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ సూచించారు. దీని ప్రభావం అంతర్జాతీయ అంతరిక్ష  కేంద్రం పై ఉంటుందని చెప్పారు. దీన్ని గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అమెరికా ను హెచ్చరించారు. ఈ మేరకు రెండు ట్వీట్లు చేసిన ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.

స్పేస్ స్టేషన్ తన కక్ష్యలోను వదిలి గతి తప్పితే భూమి మీద ఉండే ఏ దేశం పై పడుతుందో అనేది తాను చెప్పలేను అని అన్నారు. అదే ఐఎస్ఎస్ కానీ అమెరికా మీద కానీ లేద ఐరోపా మీద కానీ భారత్ మీద పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. ఐఎస్ఎస్ బరువు సుమారు 500 టన్నులకు పైగానే ఉంటుందని అన్నారు. ముఖ్యంగా భారత్ పై గానీ లేక చైనా పైన గాని అది పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఇంకా స్పందించలేదు. అలాగే ఇతర దేశాలు కూడా ఆలోచన చేస్తున్నాయి. రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ చెప్పిన దానిలో నిజం లేకపోలేదని కొందరు అంటున్నారు. మరి అమెరికా తన ఆంక్షలను వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా... అమెరికా లోని నాసా అంతరిక్ష కేంద్రం తో కలిసి కొన్ని ప్రాజెక్టులకు పని చేస్తుంది. అయితే అమెరికా విధించిన ఆంక్షలతో వాటి  మధ్య సంబంధాలు తెగిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News