ఉన్న దరిద్రం సరిపోదన్నట్లుగా కెమికల్ ఫ్యాక్టరీపై సైన్యం దాడి

Update: 2022-06-13 05:30 GMT
ఉన్న దరిద్రం సరిపోదన్నట్లుగా ఉక్రెయిన్లోని కెమికల్ ఫ్యాక్టరీపై రష్యా సైన్యం దాడిచేసింది. గడచిన నాలుగు మాసాలుగా యుద్ధం చేస్తున్న రష్యా వల్ల ఉక్రెయిన్ అన్నీ విధాలుగా దెబ్బతినేసింది. దేశంలోని చాలా నగరాలు దాదాపు శిధిలావస్తలోకి మారిపోయాయి. ఇవన్నీ సరిపోదన్నట్లుగా దాస్ బాస్ నగరానికి దగ్గర్లో పారిశ్రామికనగరమైన సీవీరోద్ నెక్ట్స్ పై రష్యా సైన్యం బాంబులు కురిపించింది. ఈ దాడిలో కెమికల్ ఫ్యాక్టరీ కూడా ధ్వంసమైపోయింది.

కెమికల్ ఫ్యాక్టరీపై దాడివల్ల రెండు రకాలుగా ఉక్రెయిన్ కు నష్టం జరిగింది. మొదటిదేమో ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్లో తలదాచుకుంటున్న సుమారు వెయ్యిమందిలో ఎంతమంది చనిపోయారో తెలీదు. సైనికులు 400 మందితో పాటు మామూలు జనాలు కూడా ఇందులోనే దాక్కున్నారు. ఇపుడీ బాంబుల దాడిలో చాలామంది చనిపోయుంటారని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

ఇక రెండో సమస్య ఏమిటంటే బాంబుల దెబ్బకు కెమికల్ ఫ్యాక్టరీ ధ్వంసమైపోయింది. దీనివల్ల ఫ్యాక్టరీలోనుండి విషవాయువులు బయటకు వచ్చేస్తున్నది. విషవాయువులు పీల్చటం వల్ల జనాలకు ఏమవుతుందో ఎవరు చెప్పలేకున్నారు.

ఈ విషవాయువులు ఎంతదూరం ప్రయాణిస్తాయి, వాటివల్ల జరిగే దుష్ఫలితాలు ఏమిటనే విషయాన్ని శాస్త్రజ్ఞులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలపై రష్యా సైన్యం చేసిన దాడులు, కురిపించిన బాంబుల కారణంగా చాలా నష్టాలు జరిగాయి.

చనిపోతున్న వారిని  ఎక్కడివాళ్ళను అక్కడే వదిలేస్తున్నారు ఉక్రెయిన్ అధికారులు. దీనివల్ల దేశంలోని అనేక నగరాల్లో వేలాది మృతదేహాలు రోడ్లపైనే పడుతున్నాయి. దీని ఫలితంగా అవన్నీ కుళ్ళిపోయి దుర్వాసన రావటమే కాకుండా కలరా వంటి అంటువ్యాధులు కూడా మొదలయ్యాయి. కుళ్ళిపోయిన మృతదేహాల మీద బ్యాక్టీరియా గాలిలో ప్రయాణించి ఇతర ప్రాంతాల్లోని వాళ్ళమీద ప్రభావం చూపుతున్నాయట.

దీనివల్ల జనాల మీద డైరెక్టుగా ప్రభావం పడటమే కాకుండా జలవనరులు కూడా కలుషితమైపోతున్నాయి. వీటిని తాగిన వాళ్ళు కూడా అనారోగ్యాలబారిన పడుతున్నారు. ఇవన్నీ సరిపోదన్నట్లుగా ఇపుడు కెమికల్ ఫ్యాక్టరీ పేల్చివేత. ఉక్రెయిన్ దేశం నాశనమైపోయేంతవరకు రష్యా వదిలిపెట్టేట్లులేదు.
Tags:    

Similar News