చైనా దూకుడును నిలువరించేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ కూటమిపై రష్యా ఫైర్ అయ్యింది. పాశ్చాత్య దేశాలు ఆడుతున్న క్రీడలో భారత్ పావుగా మారిందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన ఆరోపించారు. చైనాను నియంత్రించేందుకు పాశ్చాత్య దేశాలు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే రష్యా గతంలోనూ క్వాడ్‌పై ఆరోపణలు చేసింది. మంగళవారం నిర్వహించిన రష్యా అంతర్జాతీయ వ్యవహారల మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
అయితే భారత్ మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉంది. రష్యా చైనా మధ్య ప్రస్తుతం మెరుగైన సంబంధాలు ఉండటంతో రష్యా ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్టు ఢిల్లీలోని భారత్ విదేశాంగశాఖ వర్గాలు భావిస్తున్నాయి. సెర్గీ ఇంకా ఏమన్నారంటే.. ‘అమెరికా ప్రస్తుతం ఆధిప్యత ధోరణిని అవలంభిస్తున్నది. అన్ని దేశాలను తన కంట్రోల్లోకి తెచ్చుకొనేందుకు కుట్రలు చేస్తుంది. కానీ రష్యా, చైనా మాత్రం అగ్రరాజ్యం అమెరికా కుట్రలకు లొంగవు. మేం ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంటాం’ అని ఆయన అన్నారు. భారత్-రష్యా దేశాల సన్నిహిత దౌత్య సంబంధాలను బలహీనపరిచేందుకు అమెరికా కుట్రలు పన్నుతోందని ఆయన సెర్గీ ఆరోపించారు. మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి సాంకేతిక సమన్వయం విషయంలో భారత్‌పై అమెరికా తెస్తున్న ఒత్తిడికి కారణం ఇదే ఆయన కామెంట్ చేశారు.
మరోవైపు చైనా కూడా తరుచూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నది. ఇప్పటికే పలుమార్లు సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు సృష్టించింది. తాజాగా బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాంను కట్టేందుకు ప్లాన్ చేసింది. ఈ డ్యాం పూర్తయితే ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతినే అవకాశం ఉంది. మరోవైపు భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న నేపాల్, పాకిస్థాన్‌ను చైనా పరోక్షంగా రెచ్చగొడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.