రష్యా స్కూల్లో మారణకాండ: స్వస్తిక్ ధరించిన దుండగుడి కాల్పుల్లో 13మంది మృతి
రష్యాలోని ఓ స్కూల్‌లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. తన టీషర్ట్‌పై స్వస్తిక్ గుర్తు (నాజీ సింబల్స్) ధరించిన ఓ సాయుధుడు 13 మందిని హతమార్చాడు. వారిలో ఏడుగురు చిన్నారులు ఉండగా.. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో 9మంది విద్యార్థులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్రు టీచర్లు ఉన్నారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.గాయాలతో ఆస్పత్రి పాలైన వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
రష్యా రాజధాని మాస్కోకు 960 కి.మీల దూరంలో ఉరల్ రీజియన్ లోని ఇజెవ్ స్కి నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ దాడి చేసిన వ్యక్తి అనుమానిత నియో-నాజీ లింక్ కు చెందినవాడని.. అతడి మూలాలు కనుగొనడానికి ప్రయత్నాలు ప్రారంభించింది...
కిల్లర్ ఆర్టెమ్ కజాంట్సేవ్ గా గుర్తించారు. అతను ఈ పాఠశాలలోనే చదివి పట్టభద్రుడయ్యాడు. అతడి వయసు ముప్ఫై ఏళ్లలోపు ఉంటుంని గుర్తించారు.
ఒక తరగతి గది నేలపై ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రక్తంతో తడిసిన నేలపై కాగితాలు ఉన్నాయి. అతను తన టీషర్ట్‌పై వృత్తాకారంలో ఎరుపు స్వస్తిక్ తో ముద్రించిన నలుపు టీషర్ట్ ను ధరించాడు.
క్రెమ్లిన్ ప్రతినిధి డిమిటీ పెస్కోవ్ మాట్లాడుతూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరణాలకు 'ప్రగాఢ సంతాపం' తెలిపారు. నియో-ఫాస్కోస్ట్ సంస్థ లేదా సమూహానికి చెందిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఇది జర్మనీలో ఒకప్పుడు హిట్లర్ నెలకొల్పిన నాజీల సానుభూతి ఉగ్రవాద సంస్థ. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించాడు.
దుండగుడికి ఉగ్రవాద సంస్థతో ఉన్న సంబంధాలు.. స్కూల్ తో అతడికి గతంలో ఏమైనా లింకులున్నాయా? ఇలా చిన్నారులపై కాల్పులు జరపడానికి కారణాలు ఏంటన్న కోణంలో రష్యా భద్రతా బలగాలు విచారణ చేపట్టాయి.
రష్యా స్కూల్ లో కాల్పులు జరిగిన నిందితుడి వద్ద నుంచి రెండు నాన్ లెథల్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. గదిలో నేలపై రక్తపు మరకలు, కిటీకీ అద్దాల్లోంచి తుపాకీ బుల్లెట్ దూసుకుపోయిన ఆనవాళ్లు.. తరగతి గదుల్లో డెస్కుల కింద తలాచుకున్న విద్యార్థుల ఆర్తనాదాలు వినిపించాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Video emerges of evacuation during shooting in #Russia school shooting, as the Russian media reports the death toll raised to 13, among them 7 children pic.twitter.com/jvvavL7XW8
— i24NEWS English (@i24NEWS_EN) September 26, 2022