ఉక్రెయిన్ మ‌హిళ‌ల‌ను రేప్ చేస్తున్న ర‌ష్యా సైనికులు!

Update: 2022-03-05 05:49 GMT
ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఆ దేశ రాజ‌ధానిని సొంతం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా బాంబుల‌తో విరుచుకుప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుంచి ప్ర‌జ‌లు, విదేశీయులు ప్రాణ‌భ‌యంతో ఇత‌ర దేశాల‌కు వెళ్తున్నారు. ఇప్ప‌టికే యుద్ధం మొద‌లై 9 రోజులు అయిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 10 ల‌క్ష‌ల మంది సాధార‌ణ జ‌నం ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోయార‌ని ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌తినిధులు చెబుతున్నారు. మ‌రోవైపు ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్న ర‌ష్యా బ‌ల‌గాలు త‌మ దేశ మహిళ‌ల‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్నాయ‌ని ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

అమాయ‌కుల మీద అత్యాచారాలు..

ఉక్రెయిన్‌లో మ‌హిళ‌ల మీద ర‌ష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నార‌ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి డిమోట్రో కులెబా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశానికి చెందిన అమాయ‌కులైన మ‌హిళ‌ల మీద ర‌ష్యా సైనికులు దాడ చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఎదురు తిరిగిన అమ్మాయిల‌ను రేప్ చేసి రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కులెబా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ మీద ర‌ష్యా సైనికులు అత్యాచారం చేశార‌నే విష‌యాన్ని మ‌హిళ‌లు బ‌య‌ట‌కు చెప్ప‌లేక‌పోతున్నార‌ని, త‌మ అధికారులు ఈ స‌మాచారం ఇచ్చార‌ని లండ‌న్‌లో ఉన్న కులెబా వెల్ల‌డించారు. యుద్ధం నేప‌థ్యంలో కులెబా తాజా వ్యాఖ్య‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే ర‌ష్యా సైనికులు ఉక్రెయిన్ మ‌హిళ‌ల మీద దాడులు చేశార‌నే విష‌యంలో కులెబా ఎలాంటి ఆధారాలు చూపించ‌లేక‌పోయార‌ని ప్ర‌ముఖ రాయిట‌ర్స్ మీడియా తెలిపింది. మ‌రోవైపు రష్యాను అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ముందు నిల‌బెట్టి స‌రైన బుద్ధి చెబుతామ‌ని కులెబా హెచ్చ‌రించారు.

అధ్య‌క్షుడి హ‌త్య‌కు ప్ర‌య‌త్నాలు..

ర‌ష్యా దాడుల‌ను ఉక్రెయిన్ సైన్యం స‌మ‌ర్థంగా తిప్పికొడుతోంది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీని అంతం చేసేందుకు ర‌ష్యా సేన‌లు ప‌లుమార్లు ప్ర‌య‌త్నించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న్ని చంపేందుకు వంద‌ల మంది ప్రైవేటు సైన్యం కీవ్ న‌గ‌రంలో అడుగుపెట్టింద‌ని స‌మాచారం. క్రెమ్లిన్ మ‌ద్ద‌తున్న వాగ్న‌ర్ గ్రూప్‌తో చెచెన్ స్పెష‌ల్ ఫోర్స్ ప‌లుమార్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడిని మ‌ట్టుపెట్టేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఓ అంత‌ర్జాతీయ వార్తా సంస్థ వెల్ల‌డించింది. ర‌ష్యాకు చెందిన పారా మిలిట‌రీ ప్రైవేటు సైన్య‌మైన వాగ్న‌ర్ గ్రూప్‌న‌కు చెందిన సాయుధ‌ ద‌ళాలు జెలెన్‌స్కీ హ‌త్య‌కు రెండు సార్లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో వాగ్న‌ర్ స‌మూహంలోని కొంద‌రు ర‌ష్యా ప్రైవేటు సైనికులు హ‌త‌మైన‌ట్లు తెలిసింది.

మ‌రోవైపు చెచెన్ ద‌ళాలు కూడా జెలెన్‌స్కీని చంపేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఉక్రెయిన్ జాతీయ భ‌ద్ర‌తా, ర‌క్ష‌ణ మండ‌లి కార్య‌ద‌ర్శి ఒలెక్సీయ్ డానివోల్ తెలిపారు. అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించిన ఉక్రెయిన్ బ‌ల‌గాలు వారిని ధీటుగా ఎదుర్కొన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇంటిలిజెన్స్ స‌మాచారంతో ఆ కుట్ర‌ను భ‌గ్నం చేశామ‌న్నారు.  యుద్ధాన్ని వ్య‌తిరేకించే ర‌ష్యా ఫెడ‌ర‌ల్ సెక్యూరిటీ స‌ర్వీసెస్‌లోని కొన్ని వ‌ర్గాలు త‌మ‌కు ఈ స‌మాచారాన్ని ముందుగానే ఇచ్చాయ‌ని వెల్ల‌డించారు. అధ్య‌క్షుడిని హ‌త్య చేస్తే అందులో త‌మ ప్రేమ‌యం లేద‌ని చెప్పేందుకు ప్రైవేటు సైన్యాన్ని ర‌ష్యా బ‌రిలో దించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి.



Tags:    

Similar News