భారత క్రికెట్ లో నయా సంచలనం రుతురాజ్ గైక్వాడ్. 24 ఏళ్ల ఈ మహారాష్ట్ర కుర్రాడు దేశవాళీ మ్యాచ్ ల్లో, ఐపీఎల్ లో దుమ్మురేపాడు. రెండు, మూడేళ్లుగా నిలకడకు మారుపేరుగా మారాడు. ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ గా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియా తలుపు తడుతూ.. ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇప్పుడిక తుది జట్టులో ఆడడమే మిగిలింది. వాస్తవానికి రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కప్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. సీఎస్‌కే ఓపెనర్‌గా 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.విజయ్ హజారే ట్రోఫీలోనూ ఐదు మ్యాచుల్లో 168 అత్యధిక స్కోరుతో 603 పరుగులు చేశాడు. గత జులైలో లంకతో జరిగిన సిరీస్‌లో టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచుల్లో 38 పరుగులే చేశాడు.
ఎంపిక చేయక తప్పలేదు
విజయ్ హజారే టోర్నీలో రుతురాజ్ చెలరేగాడు. ఏకంగా నాలుగు సెంచరీలు బాది అదరహో అనిపించాడు. ఇవన్నీ కూడా భారీ సెంచరీలే. ఆ టోర్నీలో రుతురాజ్ జోరు చూసి... అతడిని టీమిండియాకు ఎంపిక చేయకతప్పదని ‘తుపాకీ’చెప్పింది. ఇప్పుడదే జరిగింది. వాస్తవానికి కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో దూరమైనందున రుతురాజ్ ను ఎంపిక చేయడం మరింత ఖాయమైంది. అయితే, మరో ఓపెనర్ ధావన్ కు చోటుదక్కినందున రుతురాజ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడా? లేదా మిడిలార్డర్ లో దిగుతాడా చూడాలి. నిజంగా చూస్తే టీమిండియా మిడిలార్డర్ కొన్నేళ్లుగా చాలా అస్థిరంగా ఉంది. ఈ స్థానంలో తెలుగు ఆటగాడు అంబటి రాయుడు తర్వాత మరో స్థిరమైన బ్యాట్స్ మన్ దొరకలేదు. కాబట్టి.. రుతురాజ్ లాంటి నిలకడకు మారుపేరైన ఆటగాడు అత్యంత అవసరం.
ఆశ్చర్యపర్చిన ఎంపికలు
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక కొంత ఆసక్తి రేపింది. జట్టులో చోటు ఉంటుందో లేదోనని అనుమానం నెలకొన్నశిఖర్ dకు మరో చాన్సిచ్చారు. చానాళ్ల పాటు సేవలందించిన సీనియర్లకు తగిన అవకాశాలు ఇవ్వాలనే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆలోచనలో భాగమే ఇదని భావించవచ్చు. ఇక మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ను జట్టులోకి తీసుకోవడం మరో ఆసక్తికర ఎంపిక. హార్దిక్ పాండ్యా ఎలాగూ బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నందున అతడి స్థానాన్ని అయ్యర్ భర్తీ చేయనున్నాడు. అంటే హార్దిక్ ను పూర్తిగా విస్మరించినట్టే. గాయంతో ఇటీవలి సిరీస్ లకు దూరమైన యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అన్నిటినీ మించి.. రోహిత్ స్థానంలో జట్టును నడిపించేది ఎవరనే సందిగ్ధానికి తెరదించుతూ కేఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగించారు. అంటే.. సెలెక్టర్ల భవిష్యత్ ప్రణాళికల్లో రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడనేది స్పష్టమవుతోంది.