మహారాష్ట్ర ఓపెనర్, ప్రస్తుత రంజీ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతి భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో చెన్సై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా ఆడి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచిన రుతురాజ్ తన ప్రతిభ ఏమిటో అందరికీ చాటాడు. గతేడాది ఐపీఎల్ లీగ్ ప్రారంభంలోనే కరోనా బారినపడి.. తొలి మ్యాచ్ ల్లో ప్రతిభ చూపలేకపోయాడు. చివరి మ్యాచ్ ల్లో రాణించి ఫర్వాలేదనిపించాడు. అయితే, ఈ ఏడాది మాత్రం లీగ్ ప్రారంభం నుంచే అదరగొట్టాడు. దీనికి ప్రతిఫలంగానే చెన్సై సూపర్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకుంది. కెప్టెన్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలతో పాటు రుతురాజ్ ను రిటైన్ చేసుకోవడం అంటే అతడి స్థాయి పెరిగినట్టే. దీనికితోడు అంతకుముందు జరిగిన శ్రీలంక టూర్ కు టీమిండియాకు ఎంపికయ్యాడు రుతురాజ్. ఇప్పటికే ఇతడిపై భారీ అంచనాలున్నాయి. గైక్వాడ్ వయసు 18 ఏళ్లు కాదని.. 24 ఏళ్లని, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పడు ఎంపిక చేస్తారంటూ మాజీ చీఫ్ సెలక్టర్, దిగ్గజ బ్యాట్స్ మన్ దిలీప్ వెంగ్ సర్కార్ ప్రశ్నించాడు.
విజయ్ హజారేలో వీర విహారం
ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ అదరగొడుతున్నాడు. అది కూడా అలా ఇలా కాదు.. సెలక్టర్లకే ఇతడిని ఎంపిక చేయకుంటే ఎలా అనేలా భయం పుట్టించేలా ఆడుతున్నాడు. 136, 154, 124, 168... ఇవీ విజయ్ హజారే టోర్నీలో గత ఐదు మ్యాచ్ ల్లో గైక్వాడ్ స్కోర్లు. ఐదు మ్యాచ్ ల్లో 4 సెంచరీలంటే మాటలా? అవి కూడా భారీ శతకాలే. ఈ మ్యాచ్ లకు ముందు జరిగిన ఐదు మ్యాచ్ ల్లోనూ రుతురాజ్ మూడు అర్ధ శతకాలు కొట్టాడు. దీన్నిబట్టి అతడు ఏ స్థాయి ఫామ్ లో ఉన్నాడో తెలుసుకోవచ్చు. మంగళవారం ఛండీగఢ్ తో జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ విశ్వరూపం చూపాడు. 132 బంతుల్లో ఆరు సిక్స్లులు, 12 ఫోర్లతో ఏకంగా 168 పరుగులు చేశాడు.
కోహ్లి స్థానంలో అతడే..?
రుతురాజ్ కు టీమిండియా లో చోటు ఎందుకు ఇవ్వడం లేదని ఇప్పటికే సెలక్టర్లపై ఒత్తిడి ఉంది. ఇప్పుడిక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. ఎలాగూ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లి దూరంగా ఉంటాడన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుతురాజ్ ను అతడి స్థానంలో ఎంపిక చేస్తారని భావించవచ్చు. వాస్తవానికి ఇదే సరైన నిర్ణయం కూడా. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ఒకప్పటి కోహ్లిని తలపిస్తున్న రుతురాజ్ ఎంపిక సమంజసం కూడా. మరి సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం?