వినటానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. రాజకీయాల్లో శాశ్విత మిత్రత్వం.. శాశ్విత శత్రుత్వం అన్నది ఉండదన్న విషయం మరోసారి నిరూపితమైంది. నిన్న మొన్నటివరకూ రాజకీయ శత్రుత్వం విషయంలో ఉప్పు.. నిప్పులా ఉండే ఇరువురు నేతల మధ్య అనుబంధం చూసి ప్రజలు సైతం షాక్ తిన్న పరిస్థితి.
రోజురోజుకీ తెలంగాణలో బలపడిపోవటమే కాదు.. విపక్షాల ఉనికికి ప్రమాదంగా మారుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై దండయాత్రకు విపక్షాలన్నీ ఏకం కావాలన్న మాటలో నిజం ఉందని.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయనటానికి నిదర్శంగా తాజాగా ఒక ఉదంతం చోటు చేసుకుంది.
ప్రాణహిత.. చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తెలంగాణ విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రీడిజైన్ కు తాము ఒప్పుకోమని చెప్పటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని దుమ్మెత్తిపోస్తూ.. ప్రజల్లో అవగాహన పెంచటానికి.. తమ వదనను వినిపించటానికి వీలుగా రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఈ సమావేశానికి టీటీడీపీ యువనేత రేవంత్ రెడ్డి.. టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు తెలుగు తమ్ముళ్లు ఈ సభకు హాజరయ్యారు.
నిజానికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. కానీ.. విస్మయం రేకెత్తించే అంశం ఏమిటంటే.. సభ జరుగుతున్న సమయంలో అక్కడకు ఏపీ మాజీ హోం మంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. కారులో నుంచి దిగటమే నేరుగా వేదికపైకి వెళ్లి రేవంత్ రెడ్డి భుజం తట్టటం పలువురిని విపరీతంగా ఆకర్షించింది. ఈ పరిణామం సభకు వచ్చిన వారందరిని విస్మయానికి గురి చేసింది.
సబితమ్మ లాంటి సీనియర్ నేత రేవంత్ వెన్నుదన్నుగా నిలవటం విపక్షాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్న భావన వ్యక్తమవుతోంది. కేసీఆర్ లాంటి నేతను ఎదుర్కోవటానికి విపక్షాల మధ్య ఐక్యత ఎంత కీలకమన్న విషయాన్ని తాజా పరిణామం చెప్పకనే చెప్పినట్లు ఉంది.
ఇదే సమయంలో.. గత కొద్దికాలంగా వినిపిస్తున్నట్లుగా.. తెలంగాణలో అధికారపక్షాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా.. విపక్షాలన్నీ ఒకే మాట మీద ఉండటమే కాదు.. లోగుట్టు వ్యవహారాలకు తెర తీస్తాయన్న వాదనకు బలం చేకూరేందుకు తాజా ఉదంతం ఒక నిదర్శనంగా టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఏమైనా రేవంత్ రెడ్డి సామర్థ్యాన్ని గుర్తించినట్లుగా.. కేసీఆర్ పై యుద్ధం చేయగలిగిన సమర్థత ఉన్న వ్యక్తిగా రేవంత్ షోకేస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది.