ప్రముఖులు తమకు తాముగా కొన్ని గ్రామాల్ని ఎంపిక చేసుకొని దత్తత తీసుకోవటం మామూలే. కాకుంటే ఈ కాన్సప్ట్ శ్రీమంతుడు సినిమా తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకు చాలా కాలం ముందే.. క్రికెట్ దేవుడు సచిన్ ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలో పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
నిజానికి సచిన్ దత్తత తీసుకునే వరకూ ఈ గ్రామం గురించి బయట ప్రపంచానికి తక్కువ తెలుసు. క్రికెట్ దేవుడి దత్తత గ్రామంలో వచ్చిన పేరు ప్రఖ్యాతులతో ఆ ఊరు రూపురేఖల్లో మార్పు వచ్చింది. కాకుంటే.. తాజాగా ఈ ఊరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ మధ్యన ఈ ఊర్లో విష జ్వరాలు భారీగా ప్రబలాయి. అక్కడి తాగునీరు కలుషితం కావటంతో ఈ దుస్థితి ఏర్పడింది.
దీంతో.. గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున విషజ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అధికారులు.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఆ గ్రామ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. తాను దత్తత తీసుకున్న ఊరుకు సంబంధించిన తాజా పరిస్థితి క్రికెట్ దేవుడికి తెలిసి ఉండకపోవచ్చని.. ఒకవేళ తెలిసి ఉంటే ఆయన ఏదో ఒకటి చేసేవారని.. ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. మరి.. తాను దత్తత తీసుకున్న ఊరు జబ్బున పడిందన్న విషయం క్రికెట్ దేవుడికి ఎవరు చెబుతారు..?