క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే సెక్స్ లో పాల్గొనొద్దా?

Update: 2021-04-04 02:30 GMT
రోనా తెచ్చిన తంటా ఒక్క‌టి కాదు.. ఎన్నో ర‌కాల ఇబ్బందుల‌కు గురిచేసిన ఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌.. సుఖాల‌కూ, సంతోషాల‌కూ అడ్డంకిగా మారింది. వైర‌స్ నిరోధానికి ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు క‌నిపెడుతున్నారు. మ‌న‌దేశంలోనూ రెండు వ్యాక్సిన్లు సిద్ధం చేశారు. కోవాగ్జిన్ ఒక‌టి కాగా.. కొవీషీల్డ్ మ‌రొక‌టి. మ‌రి, ఈ రెండు వంద శాతం సుర‌క్షిత‌మా? అంటే అవును అని చెప్ప‌లేని పరిస్థితి.

కొద్ది మందికి విక‌టించి ప్రాణాలు కోల్పోయిన సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. అయితే.. మొద‌ట్లో ఒక‌టీ అరా ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత అంతా ప్ర‌శాంతంగానే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే.. దీర్ఘ‌కాలంలో దీనివ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు, స‌వాళ్లు ఏమైనా ఉంటాయా? దుష్ప్రభావాలు కనిపిస్తాయా.. అంటే ఖచ్చితంగా లేదని చెప్పలేకపోతున్నారు వైద్యులు.

ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు వ్యాక్సిన్ల‌పై ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌నాల‌కు చాలా సందేహాలు ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైంది శృంగారం. వ్యాక్సిన్ తీసుకున్న‌వారు శృంగారంలో పాల్గొనొచ్చా? పిల్లలను కనొచ్చా? ఎంత గ్యాప్ తీసుకోవాలి? గర్భం దాలిస్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? వంటి ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లభించట్లేదు.

అయితే.. కొన్ని సూచనలు మాత్రం చేస్తున్నారు. అనుభవంతో చెబుతున్నారో.. ముందస్తు జాగ్రత్తలుగా సూచిస్తున్నారో తెలియదుగానీ.. వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడు నెలల పాటు పిల్లలను కనడానికి దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. అదేవిధంగా.. సెక్స్ లో పాల్గొనేప్పుడు కండోమ్ ధ‌రించ‌డం ఉత్త‌మం అని చెబుతున్న‌రు. అదేవిధంగా.. వ్యాక్సిన్ తీసుకున్న‌వారు స్పెర్మ్ కూడా డొనేట్ చేయొద్ద‌ని సూచిస్తున్నారు.

ఖ‌చ్చితంగా మూడు నెల‌ల‌పాటు ఉండి, త‌ర్వాత ట్రై చేయొచ్చా? అనే ప్రశ్న‌లు వేయ‌కండి. వంద‌శాతం ఆన్స‌ర్ చేసే కండీష‌న్ లేదు. కాబ‌ట్టి.. అర్జెంటుగా పిల్ల‌ల‌ను క‌నేసి, వారికేదైనా ప్రాబ్ల‌మ్స్ వ‌స్తే.. ఇబ్బందులు ప‌డాల్సింది పిల్ల‌ల‌తోపాటు మీరు కూడా. అందువ‌ల్ల ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది.
Tags:    

Similar News